Watch Video: ఫ్యామిలీ వెకేషన్లో సందడి చేస్తున్న సీనియర్ పొలిటీషియన్.. ఎవరో గుర్తుపట్టారా..
వెకేషన్లో సన్నిహితులతో కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తున్నారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. మంచుకొండల్లో ఆడుతూ ఆనందంగా కనిపించారు. ట్రక్కింగ్ చేస్తూ, కొండలు, గుట్టలు ఎక్కుతూ, దిగుతూ తెగ సరదాగా గడిపారు. రఘువీరా రెడ్డి ఈ పేరు వినగానే కాంగ్రెస్ సీనియర్ నేతగా చాలా మందికి గుర్తుకు వస్తారు. ఏపీ రాజకీయాల్లో గతంలో చాలా చురుగ్గా పనిచేశారు. రాష్ట్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షునిగా కూడా బాధ్యతలు చేపట్టారు. విభజన తరువాత కాంగ్రెస్ ఏపీలో కనుమరుగైపోవడంతో తన ఇంటి, పొలం పని చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
వెకేషన్లో సన్నిహితులతో కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తున్నారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. మంచుకొండల్లో ఆడుతూ ఆనందంగా కనిపించారు. ట్రక్కింగ్ చేస్తూ, కొండలు, గుట్టలు ఎక్కుతూ, దిగుతూ తెగ సరదాగా గడిపారు. రఘువీరా రెడ్డి ఈ పేరు వినగానే కాంగ్రెస్ సీనియర్ నేతగా చాలా మందికి గుర్తుకు వస్తారు. ఏపీ రాజకీయాల్లో గతంలో చాలా చురుగ్గా పనిచేశారు. రాష్ట్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షునిగా కూడా బాధ్యతలు చేపట్టారు. విభజన తరువాత కాంగ్రెస్ ఏపీలో కనుమరుగైపోవడంతో తన ఇంటి, పొలం పని చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. అయితే గతంలో జరిగి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత రఘువీరా రెడ్డి తనవంతు పార్టీకి సేవలు అందించారు.
అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించలేదు. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. గత నెలలో పోలింగ్ ముగిసి జూన్ 4న ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే కాంగ్రెస్ గతం కంటే కొంత మెరుగైన పాత్ర పోషించింది. ఓటు షేర్ ను సాధించగలిగింది. ఈ క్రమంలో పార్టీ పనులు పక్కన పెట్టి తన వెకేషన్ ను సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి మంచుకొండల్లో విహరించారు. అందరూ కలిసి సరదాగా అడుతూ పాడుతూ సందడి చేశారు. ముఖ్యంగా రఘువీర వయసుతో సంబంధం లేకుండా చంటి పిల్లాడిలా మారిపోయారు. గుర్రం ఎక్కి స్వారీ చేశారు. అసలు మన రాజకీయ నేత రఘువీరానేనా అనేంతగా డ్రస్సింగ్ చేసుకున్నారు. ఎప్పుడూ పల్లెల్లో తిరుగుతూ, తెల్లని రైతు బట్టలు ధరించే రఘువీరా రెడ్డి, స్టైలిష్ లుక్ లో జీన్స్ ప్యాంటు, జాకెట్ వేసుకుని కనిపించారు. దీంతో ఆయనను చూసిన వాళ్లంతా ఏంటి మన రఘువీరానా..! ఇలా మారిపోయారేంటి.. అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…