Andhra Pradesh: నా ఫోన్లూ ట్యాప్ చేస్తున్నారు.. సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు..

|

Jan 31, 2023 | 4:25 PM

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే...

Andhra Pradesh: నా ఫోన్లూ ట్యాప్ చేస్తున్నారు.. సీనియర్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు..
Anam Ram Narayana Reddy
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని ఆరోపించారు. ఇదే పెద్ద దుమారం రేపుతోంది. వారి ఆరోపణలను మంత్రులు ఖండిస్తున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తనకు ఉన్న రెండు ఫోన్లను, తన పీఏ ఫోన్‌ని రెండేళ్ల నుంచి ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు ఆనం రాంనారాయణరెడ్డి. కోటంరెడ్డి కూడా చాలా సంచలన వ్యాఖ్యలే చేశారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయని, వాటిని బయట పెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయని వ్యాఖ్యానించారు. స్టేట్‌ గవర్నమెంట్ షేక్‌ అవుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ విచారణ జరుపుతోందని కూడా మాట్లాడారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల నా మనసు కలత చెందింది. కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా నా ఫోన్‌ను ట్యాపింగ్‌ చేస్తున్నారు. ఫోన్‌ కాల్స్‌ను రహస్యంగా వింటున్నారు. మూడు తరాలుగా వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్నా. అనుమానం ఉన్నచోట కొనసాగడం కష్టం. రాజకీయాలు నాకేమీ కొత్త కాదు. ఎత్తుపల్లాలు తెలిసినవాడిని. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే.

– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి

దీనిపై.. మాజీ మంత్రి బాలినేని స్పందించారు. సొంత పార్టీ నేత ఫోన్‌ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది కేవలం కోటం రెడ్డి అపోహ మాత్రమే అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స్పందించారు. ఇదంతా టీ కప్పులో తుఫాను లాంటిదని ఆయన అన్నారు. శ్రీధర్‌ రెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారని, మనసుకు ఏదైనా నొచ్చుకున్న సంఘటన ఉంటే చర్చిస్తామని మంత్రి తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..