Congress: లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు.. ఏపీ రాజకీయాలపై మాణిక్కం ఠాకూర్ కీలక వ్యాఖ్యలు..
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత వరుస బహిరంగ సభలతో ముందుకు సాగుతున్నారు. అదే తరుణంలో గెలుపు గుర్రాలను కూడా ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ కొత్త జోష్ కనబరుస్తోంది. ఏపీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది.
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో ఆచీతూచి అడుగులు వేస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత వరుస బహిరంగ సభలతో ముందుకు సాగుతున్నారు. అదే తరుణంలో గెలుపు గుర్రాలను కూడా ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ కొత్త జోష్ కనబరుస్తోంది. ఏపీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. తెలంగాణలో అనుసరించిన స్ట్రాటజీని ఏపీలోనూ అమలు చేయనుంది. వైసీపీ, టీడీపీ, జనసేన బీజేపీకి బీ టీమ్ అంటూ ఉధృతంగా ప్రచారం చేయనుంది. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాకూర్. ఆ ముగ్గురూ బీజేపీ బీ టీమ్ అని అభివర్ణించారాయన.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రాష్ట్రంలో తొలిసారి పర్యటిస్తు్న్నారు. విజయవాడలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీలో కొత్త చేరికలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. వైసీపీ, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు మాణిక్కం ఠాగూర్. షర్మిలకు ఏ బాధ్యత ఇవ్వాలనేది ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయిస్తారని మాణిక్కం ఠాగూర్ తెలిపారు. ఏపీ పర్యటనలో భాగంగా మాణిక్కం ఠాగూర్ ఒంగోలులో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. సోషల్ మీడియా టీమ్‌తోనూ సమావేశమౌతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..