AP Corona: డబ్బులు కట్టి చేరినప్పటికీ క‌నీస వైద్యం అందించ‌డం లేదు.. డిప్యూటీ తహ‌సీల్ధార్ వీడియో వైర‌ల్

|

May 06, 2021 | 2:04 PM

కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టినా కూడ సరైన వైద్య సహాయం అందని దుస్థితి నెలకొంది. తాజాగా శ్రీకాకుళం...

AP Corona: డబ్బులు కట్టి చేరినప్పటికీ క‌నీస వైద్యం అందించ‌డం లేదు.. డిప్యూటీ తహ‌సీల్ధార్ వీడియో వైర‌ల్
Dy Thaslidar Video
Follow us on

కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బులు కట్టినా కూడ సరైన వైద్య సహాయం అందని దుస్థితి నెలకొంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కోవిడ్‌ దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ మురళీకృష్ణ ఇటీవల కోవిడ్‌ బారినపడ్డారు. ఆయన తల్లికి కూడా వైరస్‌ సోకింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో డబ్బులు కట్టి చేరినప్పటికీ తమకు కనీస వైద్యం కూడా అందించడం లేదని చెప్పారు. తన తల్లికి ఇంకా కనీసం సెలైన్‌ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు అడిగినా పట్టించుకునే నాధుడే లేరని ఆయన ఆరోపించారు.

ఆస్పత్రిలో పదే పదే అడిగితేనే భోజనం అందిస్తున్నారని, అది కూడా పాచిపోయిన భోజనం రోగులకు పెడతున్నారని మురళీ కృష్ణ ఆరోపించారు. అర్ధరాత్రి 12 గంటలకు భోజనం ఇస్తున్నారంటూ ఆయన ఓ సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశారు. ప్రస్తుతం డిప్యూటీ తహసిల్దార్‌ మురళీకృష్ణ షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.

 

Also Read:  ఆధార్ మిస్ యూజ్ అవుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా? మీ కార్డును ఇలా లాక్ చేసుకోండి..

అరుణ గ్రహంలో ‘ఫన్నీ శిలలు’, నాసా వారి రోవర్ ‘పర్సేవెరెన్స్’ అన్వేషణలో అన్నీ విచిత్రమే !