YSR Kapu Nestam Scheme: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం.. నేడు ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు

YSR Kapu Nestam Scheme: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు..

YSR Kapu Nestam Scheme: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం.. నేడు ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అగ్రవర్ణ పేదలకు ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్లతో కాపులకు మేలు జరుగుతుందని, విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Follow us
Subhash Goud

|

Updated on: Jul 22, 2021 | 7:06 AM

YSR Kapu Nestam Scheme: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే కొత్త కొత్త పథకాలను చేపడుతున్నారు. ఇక రాష్ట్రంలో వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3,27,244 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ముఖ్యమంత్రి జగన్‌ రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం అందించబోతున్నారు. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేయనున్నారు.

అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ సొమ్ముల్ని పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల ఆర్ధికాభివృద్ది, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వరసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు.

అవినీతికి తావు లేకుండా..

కాగా, ప్రభుత్వ పథకాల్లో ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హత ఉన్న వారికి అందే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందించాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకోంది. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా గత ఏడాది 3,27,349 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 491.02 కోట్లు జమ చేయగా, గురువారం 3,27,244 మంది పేద కాపులకు అందిస్తున్న రూ. 490.86 కోట్లతో కలిసి మొత్తం రూ. 981.88 కోట్ల లబ్ది చేకూరుతోందని ప్రభుత్వం వెల్లడించింది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే.. కానీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండేళ్ళలోనే వివిధ పథకాల ద్వారా 68,95,408 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 15 రెట్లు ఎక్కువగా రూ. 12,156.10 కోట్ల లబ్ది చేకూర్చిందని ప్రభుత్వం వెల్లడిస్తోంది.

ఇవీ కూడా చదవండి

Sainik School kalikiri: చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు… అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి.

Ashok Gajapathi Raju : మాన్సాస్ పరిణామాలు, సంచయిత, విజయసాయి ఆరోపణలపై అశోక్ స్ట్రాంగ్ కౌంటర్