Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. కొత్తగా ఎవరంటే..

|

Jan 24, 2023 | 7:34 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్‌గా సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని...

Andhra Pradesh: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ బదిలీ.. కొత్తగా ఎవరంటే..
Andhra Pradesh Cid
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఐడీ కొత్త చీఫ్‌గా సంజయ్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా సంజయ్, 1996 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన వ్యక్తి. ఇక ఇప్పటివరకు సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే అనూహ్యంగా సునీల్‌కుమార్‌ బదిలీపై ఇప్పుడు అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సునీల్‌కుమార్‌పై నివేదిక తెప్పించుకున్న సర్కార్, ఆయనపై వచ్చిన విమర్శల ఆధారంగా ఈ బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. సునీల్ కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం అతనికి మరే ఇతర బాధ్యతలు అప్పగించకుండా జీఏడీ కి రిపోర్ట్ చేయాలని పేర్కొంది. అంటే ఆయనకు ఇతర పదవి ఇవ్వకుండా పక్కకు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనితో సునీల్‌కుమార్‌ ట్రాన్స్‌ఫర్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ సీఐడీ చీఫ్‌గా సంజయ్‌ను నియమించిన ప్రభుత్వం అతనికి అదనపు బాధ్యతలు అప్పగించింది. విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీ బాధ్యతలను అలాగే కొనసాగించింది. అతి త్వరలోనే సంజయ్ ఏపీ సీఐడీగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు సునీల్ కుమార్ అనూహ్య బదిలీతో మరికొంతమంది అధికారుల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరికొద్దిరోజుల్లో ఈ బదిలీలు కూడా ఉండొచ్చని సమాచారం. అయితే ఆ బదిలీలు ఏ శాఖలో ఉంటాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..