Vijayawada: నెలసరి ఇబ్బందులకు చెక్‌.. విజయవాడ రైల్వే స్టేషనల్‌లో శానిటరీ నాప్కిన్స్‌ వెండింగ్‌ మెషిన్

| Edited By: Basha Shek

Jul 08, 2023 | 3:21 PM

విజయవాడ రైల్వే స్టేషన్ లో కాయిన్ అపరేటడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ లోని స్వర్ణ జయంతి వెయిటింగ్ హాల్లో ఈ మెషిన్ ను ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఈ మెషిన్ ను ప్రారంభించింది.

Vijayawada: నెలసరి ఇబ్బందులకు చెక్‌.. విజయవాడ రైల్వే స్టేషనల్‌లో శానిటరీ నాప్కిన్స్‌ వెండింగ్‌ మెషిన్
Sanitary Napkin Dispensor
Follow us on

విజయవాడ రైల్వే స్టేషన్ లో కాయిన్ అపరేటడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకటో నెంబర్ ప్లాట్ ఫార్మ్ లోని స్వర్ణ జయంతి వెయిటింగ్ హాల్లో ఈ మెషిన్ ను ప్రారంభించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఈ మెషిన్ ను ప్రారంభించింది. తమ ఆర్గనైజేషన్ ద్వారా కొనుగోలు చేసిన ఈ మెషిన్ ను సంస్థ చైర్పర్సన్ జయామోహన్ ప్రారంభించారు. దక్షిణాదిని ఉత్తరాది రాష్ట్రాలకు కలిపే రైల్వే స్టేషన్ లలో విజయవాడ జంక్షన్ కీలకమైంది.ఈ స్టేషన్ గుండా వందలాది దూర ప్రాంత రైళ్లు ప్రయాణిస్తుంటాయి. రోజులతరబడి ప్రయాణాలు చేసే మహిళలకు,స్టేషన్ సిబ్బందికి ఈ నేప్కిన్స్ మెషిన్ ఉపయోగపడుతుందని జయా మోహన్ చెప్పారు. ఐదు, రెండు రూపాయల కాయిన్ల ను ఈ వెండింగ్ మెషిన్ లో వేయడం ద్వారా శానిటరీ నేప్కిన్ ఆటోమేటిక్ గా బయటికి వస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. నెలసరి సమయంలో మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా స్టేషన్ సిబ్బంది ద్వారా దీనిపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని ప్లాట్ ఫారం లలో మెషిన్ కు సంబందించిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు రైల్వే సిబ్బంది.

‘ఇది ఏ కార్యాలయంలోనైనా అత్యంత అవసరమైన సదుపాయం. నెలసరిలో ఉన్న మహిళలు చురుగ్గా ఉండటానికి, రోజువారీ కార్యకలాపాలలో ఉత్సాహంగా పాల్గొనడానికి కాయిన్ అపరేటడ్ శానిటరీ నేప్కిన్స్ మెషిన్ సహకరిస్తుంది’ అని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..