
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ప్రతిపక్షాలు అన్నీ ఒకే లైన్ లో ఉన్నాయని.. ఎవరైనా రాళ్లతో కొట్టించుకోగలరా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు. జగన్‌కు డ్రామాలు తెలీదని.. ఉద్దేశపూర్వకంగా కావాలనే దాడి చేయించుకున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. జగన్‌కి డ్రామాలాడాల్సిన అవసరం లేదని .. జగన్‌కి డ్రామాలాడటం.. నటించడం తెలియదంటూ సజ్జల పేర్కొన్నారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి వాళ్లు భయపడుతున్నారని.. దోషులెవరో విచారణలో తెలుస్తుందన్నారు. నింద తమపైకి వస్తుందని టీడీపీ భయపడుతోందన్నారు. ఎవరైనా తమపై తాము దాడి చేయించుకుంటారా..? అంటూ డ్రామాలంటున్న విపక్షనేతలకు సజ్జల కౌంటర్లు వేశారు. భద్రతా వైఫల్యం అంటున్నారు.. ఏం వైఫల్యమో చెప్పరు.. అంటూ పేర్కొన్నారు.
డ్రామా అని టీడీపీ చెప్పడం వెనుక వారి భయం కనిపిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పుట్టి మునిగిందని అర్థమైపోయిందని.. అందుకే.. ఇలాంటి ప్రచారం చేస్తుందన్నారు. సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో భయం పట్టుకుందని.. సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. భద్రతా వైఫల్యం అంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారని.. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో తెలియదన్నారు. దాడి ఘటనలో బాధితులం మేము.. సీబీఐ విచారణ వాళ్లు కోరుతున్నారు.. అంటూ సజ్జల ఫైర్ అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..