Vizianagaram: సుప్రియ గృహ నిర్భంధం కేసులో సుప్రియకు ఊరట.. ఈనెల 14 వరకు పిల్లలు తల్లి దగ్గర ఉండేలా కోర్టు తీర్పు

|

Mar 04, 2023 | 9:40 AM

విజయనగరం సుప్రియ గృహనిర్బంధం ఘటనలో మరో ట్విస్ట్..ఈనెల 14 వరకు సుప్రియ పిల్లలు ఆమె వద్దే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రియ హర్షం వ్యక్తం చేశారు. మరీ పిల్లలు సుప్రియతో వెళ్తారా..?

Vizianagaram: సుప్రియ గృహ నిర్భంధం కేసులో సుప్రియకు ఊరట.. ఈనెల 14 వరకు పిల్లలు తల్లి దగ్గర ఉండేలా కోర్టు తీర్పు
Sai Supriya Case
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం గృహ నిర్భంధం కేసులో బాధితురాలు సుప్రియ మరో ముందడుగు వేసింది. తన పిల్లలను తన వద్దే పంపించాలని సుప్రియ కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. పిల్లలు తన దగ్గరే ఉండాలే తీర్పు ఇవ్వాలని భర్త మధుబాబు జడ్జిని కోరారు. దీనిపై ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు. ఈనెల 14వ తేదీ వరకూ తల్లి సుప్రియ దగ్గరే పిల్లలు ఉండాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో న్యాయమూర్తి తీర్పుపై సుప్రియ హర్షం వ్యక్తం చేశారు. అయితే పిల్లలు తల్లి సుప్రియతో వెళ్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ రేపుతోంది.

విజయనగరంలో 14ఏళ్లు సుప్రియను ఇంట్లోనే బంధించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివాహితను తన పుట్టింటి వారిని కూడా కలవనివ్వలేదు. చీకటి గదికే పరిమితం చేశాడు లాయర్ గోదావరి మధుసూదన్. ఈ దారుణం గురించి చుట్టుపక్కల వారికి తెలిసినా.. అతడు న్యాయవాది కావడంతో ప్రశ్నించడానికి భయపడ్డారు. వివాహిత తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించడంతో పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకుని మధుసూదన్‌ ఇంటికి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు సెర్చ్ వారెంట్ చూపి ఇంట్లోకి వెళ్లగా..సుప్రియను చూసి ఆమె పుట్టింటి వారు షాకయ్యారు. సుప్రియ బలహీనంగా, గుర్తుపట్టలేని విధంగా ఉంది. పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచి, గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. అటు సుప్రియ తోడికోడలు పుష్పలత కూడా తనకు న్యాయం కావాలని, తన బిడ్డను అప్పగించాలని అత్తారింటి ఎదుట నిరసనకు దిగారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..