Teju at Indrakeeladri: దుర్గమ్మని దర్శించుకున్న సాయి తేజ్, బ్రో చిత్ర బృందం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

బ్రో మూవీ రిలీజైన తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. దీంతో ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ సహా చిత్ర యూనిట్ దర్శించుకుంది. సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

Teju at Indrakeeladri: దుర్గమ్మని దర్శించుకున్న సాయి తేజ్, బ్రో చిత్ర బృందం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Sai Tej At Indrakeeladri

Edited By:

Updated on: Aug 01, 2023 | 1:26 PM

మెగా హీరోలైన పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీగా బ్రో..  సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశారు. మామ అల్లుడు కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రిలీజైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ‘బ్రో’ విజయోత్సవాలను చిత్ర బృందం నిర్వహిస్తోంది. దీంతో ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి తేజ్ సహా చిత్ర యూనిట్ దర్శించుకుంది.

సాయి తేజ్ సహా చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించకుని, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటం, లడ్లను అందించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి‘బ్రో’ సినిమాలో నటించారు. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే, తమన్ సంగీతం అందించారు. విడుదలైన అన్ని సెంటర్లలో బ్రో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటైర్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..