దేశంలోనే ప్రప్రథమంగా ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ప్రారంభం.. ప్రకృతి వ్యవసాయమే లక్ష్యం.. ఎక్కడంటే..?

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 22, 2023 | 1:11 PM

Andhra Pradesh: రసాయనాలు, ఎరువులతో కూడిన వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జర్మనీ ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటిసారిగా రైతు శాస్త్రవేత్తల కోర్సును..

దేశంలోనే ప్రప్రథమంగా ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ ప్రారంభం.. ప్రకృతి వ్యవసాయమే లక్ష్యం.. ఎక్కడంటే..?
Farmer Scientist Course
Follow us on

Andhra Pradesh: రసాయనాలు, ఎరువులతో కూడిన వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జర్మనీ ప్రభుత్వంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటిసారిగా రైతు శాస్త్రవేత్తల కోర్సును ప్రారంభించింది. ఈ మూడు కలిసి ఏర్పాటు చేసిన ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్(IGGAARL) ఇందులో ప్రధాన భూమిక పోషించనుంది. రాష్ట్రంలో 8 లక్షల మంది రైతులతో విస్తృతస్థాయిలో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న నేపథ్యంలో మరికొంతమంది రైతులను ప్రకృతి వ్యవసాయంలోకి నడిపించేందుకుగాను ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకుగాను ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న కొంతమంది రైతులను ఎంపిక చేసి ఈ కోర్సు కు మొదటి బ్యాచ్ గా తీసుకున్నారు. ఈ అకాడమీ రైతుల పరిశోధన విజ్ఞానానికి ఒక వేదికగా లాభదాయకమైన ప్రకృతి సాగుకు రూపకల్పనగా పర్యావరణాన్ని కాపాడే విధంగా వ్యవసాయం చేయటమే ముఖ్య లక్ష్యంగా ఈ కోర్సును ప్రారంభించారు. ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను ఈ కోర్సుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది మొదటి బ్యాచ్ గా 500 మందితో ప్రారంభమై తొలి రెండేళ్లలో వెయ్యి మంది రైతు శాస్త్రవేత్తలను తయారు చేయాలని దృఢసంకల్పంతో ఈ కోర్సును ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.

కోర్సు ఎక్కడ ప్రారంభం.. ఏమి నేర్చుకోవచ్చు

రాష్ట్రంలోని కడపజిల్లాలో సియం సొంత నియోజకవర్గం పులివెందులలోని ఐజి కార్ల ప్రాంగణంలో ఈ కోర్సును దేశంలోనే మొదటిసారిగా ప్రారంభించారు వ్యవసాయశాఖా మంత్రి కాకాని గోవర్దన రెడ్డి.. నాలుగేళ్ల పాటు సాగే రైతు శాస్త్రవేత్తల కోర్సు ముగిసిన తర్వాత ప్రతి రైతు శాస్త్రవేత్తను రాష్ట్రంలోని ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్కరిగా నియమించనున్నారు. వ్యవసాయానికి సంబంధించి మితిమీరిన పెట్టుబడులు, ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడం, నేల నిస్సారం కావడం, వాతావరణం లో వస్తున్నాం మార్పులు, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుతం వ్యవసాయం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నింటిని అధిగమించేందుకు సరికొత్త వ్యవసాయ పద్ధతులను తీసుకువచ్చే క్రమంలో రైతులకు అండగా నిలవాలని రైతు శాస్త్రవేత్తల కోర్సును ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ నాలుగేళ్ల ఈ కోర్సు కాలంలో రైతు శాస్త్రవేత్తలకు నాలుగు విధాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

  1. ప్రకృతి వ్యవసాయంపై సంపూర్ణ అవగాహన కోసం తయారుచేసిన మాడ్యూల్ ను నేర్చుకోవడం.
  2. రైతు శాస్త్రవేత్తలు తమ సొంత పొలంలో ఏ గ్రేడ్ ప్రకృతి వ్యవసాయ నమూనాలు మరియు ఎనీ టైం మనీ నమూనాలు ఎలా తయారు చేయాలో శిక్షణ పొందడం
  3. కమ్యూనిటీ శిక్షణ కల్పించడం రైతు శాస్త్రవేత్తలు ఆగ్రో అకాలజీకి సంబంధించిన విభిన్న విషయాలను పరిశోధించం
  4. వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులను నేర్చుకుని వీటన్నిటి గ్రామంలో రైతులకు వివరించే విధానం

వీటితోరాటు ఏ పంటలు వేయాలి, ఎప్పుడు ఏమి చేయాలి అనే దానిపై పూర్తి అవగాహనతో ఈ రైతు శాస్త్రవేత్త రైతు శాస్త్రవేత్త కోర్సును నేర్చుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం నడుస్తున్న వ్యవసాయ పద్ధతులకు భిన్నంగా ఈ విధమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్క రైతు పాల్గొని ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపితే ప్రజల ఆరోగ్యంతో పాటు వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..