Andhra Pradesh: మీ తెలివికి దండం రా బాబు..! కుక్కకు చికెన్ ముక్కలు వేశారు.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు..

|

Dec 18, 2022 | 11:12 AM

ఏపీలోని గుంటూరులో భారీ చోరి జరిగింది. అచ్చం సినిమాటిక్ స్టైల్‌లో దుండగులు చోరీకి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. కేవీపీ కాలనీలోని లాలూపురం రోడ్డులో మిర్చి ఎగుమతుల కంపెనీలో ఈ చోరీ జరిగింది.

Andhra Pradesh: మీ తెలివికి దండం రా బాబు..! కుక్కకు చికెన్ ముక్కలు వేశారు.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు..
Guntur Robbery
Follow us on

ఏపీలోని గుంటూరులో భారీ చోరి జరిగింది. అచ్చం సినిమాటిక్ స్టైల్‌లో దుండగులు చోరీకి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. కేవీపీ కాలనీలోని లాలూపురం రోడ్డులో మిర్చి ఎగుమతుల కంపెనీలో ఈ చోరీ జరిగింది. ఈ కంపెనీలో మిర్చికి సంబంధించిన డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంటుంది. ఈ క్రమంలో స్కెచ్ వేసిన దుండగులు.. గుంటూరులోని మిర్చి ఎగుమతుల కంపెనీలో రూ. 20 లక్షలకుపైగా నగదు దోచుకెళ్లారు. బైక్ మీద వచ్చిన ఇద్దరు దొంగలు గేటు దగ్గర ఉన్న కుక్కకు చికెన్ ముక్కలు వేసి.. అది అరవకుండా సైలెంట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటప్పయ్యకాలనీ లాల్‌పురంరోడ్డు చివర ఓ మిర్చి కంపెనీ నుంచి మలేషియా తదితర ప్రాంతాలకు భారీ మొత్తంలో మిర్చిని ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున 2.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై కంపెనీ వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన వాచ్‌మెన్‌ ఆవులయ్య.. ఎవరని ప్రశ్నించడంతో అతని కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేశారు. అరిస్తే చంపేస్తామంటూ బ్లేడ్‌తో బెదిరించారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకతను బయట ఉండగా.. మరో వ్యక్తి కంపెనీ ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి డబ్బును అపహరించాడు.

ఈ క్రమంలో బయటకు వెళుతుండగా.. కంపెనీ వద్ద ఉన్న కుక్క అరవడంతో నిందితులు తమ వెంట తెచ్చుకున్న చికెన్‌ ముక్కలు వేసి ద్విచక్రవాహనంపై పారిపోయారని పోలీసులు తెలిపారు. రూ. 20 లక్షలకు పైగా నగదు అపహరించారని కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం సీఐ హైమారావు వెల్లడించారు. ఘటనాస్థలిలో నేరవిభాగ పోలీసులు, క్లూస్‌టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..