
వాడొక చిల్లరదొంగ.. చేసేవన్నీ కూడా చిల్లర దొంగతనాలు.. అట్లాంటి.. ఇట్లాంటివి కాదు.. ఇటీవల మనోడు చేసిన ఓ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక అవి చూసిన పోలీసులు దెబ్బకు ముక్కున వేలేసుకున్నారు. కక్కుర్తి ఉండాలి కానీ.. మరీ ఈ రేంజులోనా అంటూ నోరెళ్లబెట్టారు. కట్ చేస్తే.. ఆ చిల్లరదొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఖాకీలు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..
వివరాల్లోకెళ్తే.. పల్నాడు జిల్లాలోని గురజాల పట్టణం దాచేపల్లి మునిసిపాలిటీలో ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగతనం జరిగింది. స్థానిక బేకరీలోకి ఓ దొంగ అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా దూరాడు. షాపులో నుంచి రూ. 2 లక్షలు చోరీ చేశాడు. ఇక దొంగతనం చేసే సమయంలో మనోడి యవ్వారం అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అదేంటంటే.. షాపులోకి దూరిన దొంగ.. మొదటిగా కౌంటర్ దగ్గర ఉన్న డ్రాయర్ నుంచి రూ. 2 లక్షలు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. అప్పుడే మనోడిలోని చిల్లర దొంగ బయటకు వచ్చాడు.
ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
రూ. 2 లక్షల పెద్ద మొత్తాన్ని తీసుకున్నా.. చల్లారని అతడి కోరిక.. కౌంటర్ పక్కనే ఉన్న చిల్లర నాణేల డబ్బాపై పడింది. అందులో ఉంచిన రూపాయి నాణేలు, ఐదు రూపాయల నాణేలను సైతం వదలకుండా తన జేబులో నింపుకుని ఉడాయించాడు. పొద్దున్నే షాపు తెరిచిన యజమాని.. దొంగతనం జరిగిందని గుర్తించి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..