Kadapa: సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేసిన పోలీసులు.. లోపల సీన్ చూడగా స్టన్.!

ఎలక్షన్స్ ముగిశాయి. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితేనేం.. డబ్బుల అక్రమ రవాణా మాత్రం ఆగట్లేదు. ఇటీవల కడప జిల్లాలో భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ఎప్పటిలానే చింతకొమ్మదిన్నె మండలం చెక్‌పోస్టు దగ్గర సాధారణ తనిఖీలు చేపట్టారు పోలీసులు.

Kadapa: సాధారణ తనిఖీలు.. కారు ఆపి చెక్ చేసిన పోలీసులు.. లోపల సీన్ చూడగా స్టన్.!
Representative Checkpost

Updated on: Jun 01, 2024 | 12:55 PM

ఎలక్షన్స్ ముగిశాయి. మరికొద్ది గంటల్లో కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితేనేం.. డబ్బుల అక్రమ రవాణా మాత్రం ఆగట్లేదు. ఇటీవల కడప జిల్లాలో భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ఎప్పటిలానే చింతకొమ్మదిన్నె మండలం చెక్‌పోస్టు దగ్గర సాధారణ తనిఖీలు చేపట్టారు పోలీసులు. స్థానిక జయరాజ్ గార్డెన్స్ సమీపంలో పోలీసులు.. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా.. అటుగా వచ్చిన ఓ కారుపై అనుమానం వచ్చింది. దాన్ని ఆపి చెక్ చేయగా.. లోపల సీన్ చూసి ఖాకీలు దెబ్బకు స్టన్ అయ్యారు. అక్రమంగా తరలిస్తున్న రూ. 1.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూర్‌కు చెందిన తిరుమలయ్య అనే బంగారం వ్యాపారి.. ఈ డబ్బును చెన్నైకి తరలిస్తున్నట్టు గుర్తించారు. అయితే సదరు డబ్బుకు సంబంధించి సరైన రసీదులు ఏవి కూడా అతడి వద్ద లేకపోవడంతో.. ఆ రూ. 1.5 కోట్లను సీజ్ చేశారు పోలీసులు. అనంతరం ఐటీ అధికారులు అప్పగించారు.

ఇది చదవండి: పొలం పనుల్లో చేస్తుండగా గడ్డపారకు తగిలిన రాతిడబ్బా.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

అటు బస్సులో చెన్నైకి వెళ్తున్న ఐదుగురు మహిళల దగ్గర నుంచి సుమారు రూ. 1.61 కోట్లు సీజ్ చేశారు పోలీసులు. నెల్లూరు జిల్లా ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోని తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన సుమతి, తేజశ్రీ, పర్విన్‌, యాదమ్మ, శివమ్మ అనే మహిళల నుంచి సరైన డాక్యుమెంట్స్ లేని రూ.1,61,49,500 డబ్బులను పోలీసులు పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇదేం బాహుబలి ఏసీ భయ్యా.! స్విచ్ ఆన్ చేస్తే ఎడారిలోనైనా మంచు కురవాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..