Tanuku: 6 అడుగుల సొరకాయ.. 9 రకాల బెండకాయలు.. టెర్రాస్ గార్డన్‌తో డబ్బే డబ్బు.. ఎలాగంటారా

ఆరు అడుగుల సొరకాయ.. అడుగున్నర వంకాయ, 9 రకాల బెండకాయలు.. ఏంటి మీరు చెబుతున్నది కూరగాయల గురించేనా అని అనుకుంటున్నారా.. అవునండి.! ఆసక్తి ఉండాలే గాని అద్భుతాలు ఎవరైనా చేయవచ్చు అని నిరూపిస్తున్నారు ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అదేంటో ఈ వార్త చూసేద్దాం..

Tanuku: 6 అడుగుల సొరకాయ.. 9 రకాల బెండకాయలు.. టెర్రాస్ గార్డన్‌తో డబ్బే డబ్బు.. ఎలాగంటారా
Gardening

Edited By: Ravi Kiran

Updated on: Jun 05, 2025 | 9:36 AM

ఆరు అడుగుల సొరకాయ.. అడుగున్నర వంకాయ, 9 రకాల బెండకాయలు.. ఏంటి మీరు చెబుతున్నది కూరగాయల గురించేనా అని అనుకుంటున్నారా.. అవునండి.! ఆసక్తి ఉండాలే గాని అద్భుతాలు ఎవరైనా చేయవచ్చు అని నిరూపిస్తున్నారు ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. వ్యవసాయంలో దిగుబడులు రావడం లేదనే మాట మనకు తరుచుగా వింటూనే ఉంటాం. ఇక మనకు ఉన్న బిజీ బిజీ లైఫ్‌లో ఇంట్లో పనులు చేసుకునే తీరిక లేక పనివారిపైనా, యంత్రాలపైనా ఆధారపడుతుంటాం.

అయితే తణుకు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ముత్యాల సత్తిరాజు మాత్రం తన శేష జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలనుకున్నారు. తనకు అందుబాటులో ఉన్న నేల, డాబా పైభాగంలో మొక్కలు వేసి సేంద్రియ పద్దతిలో కూరగాయలు, ఆకు కూరలు పండిస్తున్నారు. సుమారు 20 రకాల పండ్లు, 40 రకాల కూరగాయలు స్వయంగా పండిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచాడు. అంటే కాదు తన వద్ద బాగా దిగుబడి వచ్చిన కూరగాయల విత్తనాలను అందరికి ఉచితంగా పంపిణి చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..