Kanigiri: కనిగిరి నగరపంచాయతీలో కుర్చీలాట.. రూమ్‌కి తాళమేసి వెళ్లిపోయిన పాత కమిషనర్

ప్రభుత్వం కనికరించినా.. కనిగిరిలో ఆ అధికారి కనికరించలేదు. పాపం.. నగరపంచాయతీకి కొత్త కమిషనర్‌గా వచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు ఆఫీస్‌కి వచ్చినా..

Kanigiri: కనిగిరి నగరపంచాయతీలో కుర్చీలాట.. రూమ్‌కి తాళమేసి వెళ్లిపోయిన పాత కమిషనర్
Kanigiri

Updated on: Nov 12, 2021 | 9:40 AM

ప్రభుత్వం కనికరించినా.. కనిగిరిలో ఆ అధికారి కనికరించలేదు. పాపం.. నగరపంచాయతీకి కొత్త కమిషనర్‌గా వచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు ఆఫీస్‌కి వచ్చినా బాధ్యతలు తీసుకునే భాగ్యం లేకుండా పోయింది. కారణం పాత కమిషనర్‌ నారాయణరావు. నగర పంచాయతీకి కొత్త కమిషనర్‌గా భీమవరం నుంచి బదిలీ అయ్యి వచ్చారు కృష్ణారావు. కానీ అక్కడే తిష్ట వేసిన పాత కమిషనర్‌ నారాయణరావు మాత్రం రిలీవ్ అవ్వడం లేదు. ఎంతకీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఉన్నతాధికారుల జోక్యంతో కాస్త తగ్గి అక్కడి నుంచి బదిలీ అయిన విజయవాడ వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నాడుగానీ, కనిగిరి కమిషనర్ ఆఫీస్‌రూమ్‌కి మాత్రం తాళం వేసుకెళ్లాడు.

నారాయణరావు వెళ్లిపోయారు కదాని కృష్ణారావు ఇప్పటికి మూడుసార్లు వచ్చి వెళ్లినా… రూమ్‌కి ఉన్న తాళం మాత్రం తీసేవాళ్లు లేరు. పక్క రూమ్‌లో మిగతా సిబ్బంది పనిచేసుకుంటున్నా.. ఆయనకు మాత్రం ఓ కుర్చీ, బల్ల లేకుండా పోయింది.

విచిత్రం ఏంటంటే సిబ్బంది అంతా బదిలీ అయ్యి వెళ్లిపోయిన పాత కమిషనర్‌కే వత్తాసు పలుకుతున్నారు. వాళ్లకీ వాళ్లకీ ఏముందోగానీ.. కొత్తగా వచ్చిన కృష్ణారావు మాత్రం రోజూ రావడం, రూమ్ ముందు నిలబడటం, కాసేపు ఎదురుచూడటం వెళ్లిపోవడం.. ఇదే విధిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..