Andhra Pradesh: ముగిసిన వివాహ తంతు.. కట్‌చేస్తే, పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధూవరుల బంధువులు.. ఎందుకంటే..

పెళ్లి సందడి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ వైపు వరుడి బంధువులు.. మరోవైపు వధువు బంధువులు.. సందడే సందడే.. కానీ.. ఈ వివాహ వేడుకలో వధువు, వరుడు బంధువులు పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. చివరకు పంచాయితీ కాస్త.. పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.

Andhra Pradesh: ముగిసిన వివాహ తంతు.. కట్‌చేస్తే, పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధూవరుల బంధువులు.. ఎందుకంటే..
Wedding

Updated on: May 16, 2023 | 7:23 PM

పెళ్లి సందడి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ వైపు వరుడి బంధువులు.. మరోవైపు వధువు బంధువులు.. సందడే సందడే.. కానీ.. ఈ వివాహ వేడుకలో వధువు, వరుడు బంధువులు పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. చివరకు పంచాయితీ కాస్త.. పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఓ వివాహ వేడుకలో చిన్న వివాదం కాస్త.. కొట్లాటకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయని సీతానగరం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురంలో సోమవారం సుబ్రహ్మణ్యం, పూజిత వివాహ వేడుక జరిగింది. పెళ్లికుమార్తె తరఫు బంధువులంతా తాళ్లపూడి మండలం గజ్జరం నుంచి రామచంద్రపురం విచ్చేశారు. అనంతరం బంధువుల మధ్య వివాహం ఘనంగా జరిగింది.

విందు జరుగుతోన్న సమయంలో.. నూతన వధూవరులిద్దరూ డ్యాన్స్‌ చేయాలంటూ అక్కడున్న కొందరు ఒత్తిడి చేశారు. అయితే, ఆడపిల్ల డ్యాన్స్‌ చేయడమేంటంటూ వధువు తరఫు బంధువులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సమయంలో వధువు, వరుడు బంధువల మధ్య మాటామాటా పెరిగింది. చిన్న వివాదం పెద్దదిగా మారడంతో వరుడి కుటుంబసభ్యులు వధువు కుటుంబసభ్యులపై దాడికి దిగారు.

ఈ ఘటనలో ఓ మహిళ తల పగలగా.. మరో వ్యక్తికి చేయి విరిగింది. మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయయని కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..