ఆలయ వేడుకల్లో హోరెత్తిన రికార్డింగ్ డ్యాన్సులు.. నిర్వాహకులపై చర్యలకు స్థానిక మహిళల డిమాండ్..
స్థానికులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు..
ప్రకాశంజిల్లా కంభం మండలం నడింపల్లి గ్రామం లో రికార్డింగ్ డ్యాన్సులు హోరెత్తించాయి. ఏకంగా రామాలయం విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేయడం వివాదాన్ని రేపింది. స్థానికులకు అధికార పార్టీ అండదండలు ఉండడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు వేయడంపై మహిళలు మండిపడుతున్నారు. దేవుడి దగ్గర బీ గ్రేడ్ సాంగ్స్‌కి డ్యాన్సులు చేయించడం దారుణమంటున్నారు.
రికార్డింగ్ డాన్స్ లపై స్థానిక ప్రజలతో పాటు పలువురు విమర్శలు గుప్పించారు. ప్రతి దానికి రూల్స్ మాట్లాడే పోలీసులు, ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. దేవుడి విగ్రహ ప్రతిష్ట సందర్బంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు… రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.