AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madanapalle: శోభనం గదిలో చనిపోయిన నవవరుడు.. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకుండానే

శోభనం గదిలో ఒక్కసారిగా విగతజీవిగా మారిపోయాడు నవవరుడు. వధువు లేపేందుకు ఎంత ప్రయత్నించినా చలనం లేదు. దీంతో ఆమె భయపడి కుటుంబ సభ్యులను పిలిచింది.

Madanapalle: శోభనం గదిలో చనిపోయిన నవవరుడు.. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకుండానే
Groom Dies
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2022 | 11:50 AM

Share

Annamayya District: అన్నమయ్య జిల్లా  షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మదనపల్లెలో నవ వరుడు శోభనం గదిలో మృతిచెందాడు. పెళ్లి జరిగి ఒక్క రోజు కూడా గడవకముందే..  అతడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లె చంద్రా కాలనీకి చెందిన యువతితో..  పాకాల మండల పత్తిపాటివారిపల్లికి  చెందిన తులసి ప్రసాద్‌కు పెద్దల సమక్షంలో ఈ నెల 12( సోమవారం) పెళ్లి జరిగింది. వీరు తొలుత ప్రేమించుకోగా.. వారి ప్రేమను ఒప్పుకుని పెద్దలు పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే పెళ్లి  అనంతరం శోభనం తంతుకోసం తులసి ప్రసాద్ అత్తగారి ఇంటికి వెళ్లాడు. అయితే రాత్రి సమయంలో తులసి ప్రసాద్ ఉన్నట్టుండి అచేతనంగా పడిపోయాడు. ఉలుకు..పలుకు లేకపోవడంతో వధువు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తులసి ప్రసాద్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పాపం.. పెళ్లి సందర్భంగా ఇంటికి కట్టిన తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి.. అదే ఇంటి ముందు అతడు నిర్జీవంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. ఘటనకు సంబంధించి.. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..