Murder in Guntur: గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ రియల్టర్‌ను దారుణంగా చంపేశారు. రావిపాడు సమీపాన ప్రైవేట్ వెంచర్‌లో రియల్టర్ కోటపాటి మల్లిఖార్జున రావు అలియాస్ వెంగమాంబ మల్లిఖార్జున రావును గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా చంపేశారు. మల్లిఖార్జునరావు.. రోజు వారీ కార్యక్రమంలో భాగంగా తెల్లవారు జామున 4.30 గంటలకు తన వెంచర్‌కి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా మల్లిఖార్జున రావు ఇంటి వద్ద నుంచి వెంచర్‌కి బయలుదేరారు. రారిరోడ్డులో టీ స్టాల్ వద్ద టీ తాగి తన వెంచర్‌కి స్కూటీపై బయలుదేరాడు. అయితే, మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు మొఖంపై సర్ఫ్ ఫౌడర్ చల్లారు. దాంతో మల్లిఖార్జున రావు కిందపడిపోయాడు. అలా కింద పడిన మల్లిఖార్జున రావుని కొబ్బరి బోండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపేశారు.
కాగా, హత్యకు గురైన మల్లిఖార్జున రావు.. 2019లో రియల్టర్ తడికమల్ల రమేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. రమేష్ హత్య జరిగిన ప్రదేశానికి అతి దగ్గరలోనే ఈ హత్య జరగడం పట్టణంలో ప్రధాన చర్చగా మారింది. కాగా, హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ రావు సైతం హత్య జరిగిన స్థలానికి చేరుకుని.. హత్య జరిగిన విధానాన్ని అంచనా వేశారు. ఈ హత్య కేసుని అన్ని కోణాల్లో విచారించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. కాగా, హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Cyber crime: అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..