ఆంధ్రదప్రదేశ్‌లో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అదుపు తప్పాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతోన్న పలు పరిణామాలపై ఆదివారం స్పందించిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా దగ్గర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పూర్తి రిపోర్ట్ ఉందని తెలిపారు. విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై స్పందిచిన జీవీఎల్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు.
విశాఖలో భూ మాఫియా జరుగుతుందని జీవీఎల్ ఆరోపించారు. విశాఖ భూ దందా పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి భూ సెటిల్మెంట్‌లు చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌ను తనకు ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని ప్రశ్నించారు. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషం అన్నారు.
వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని ఆరోపించారు. వైసీపీ అంటే రాక్షస సంత అని ప్రకటించుకోవాలంటూ యద్ధేవ చేశారు. ముఖ్యమంత్రి ఆ పిల్లవాడి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి.. సీఎం రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇసుకు, మైనింగ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలనన్న జీవీఎల్ రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని విమర్శించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..