ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి గోదావరి నదిపై కొలువుదీరిన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమత్తులు కోసం నేటి నుంచి వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి రిపేర్ పనులను ఆర్‌అండ్‌బి, రైల్వే శాఖల ఆధ్వర్యలో పనులు నిర్వహించనున్నారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని.. వాటిని రిపేర్ చేయనున్నామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేయాల్సిందిగా సూచించారు. కొవ్వూరు – రాజమహేంద్రవరం మధ్య ప్రయాణం చేయాలనీ కోరారు. అంతేకాదు.. ఈ వారం రోజుల పాటు.. గోదావరి 4వ బ్రిడ్జి మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
ద్విచక్ర వాహనాలు, మోటార్ బైక్స్, కార్లు, ఆర్టీసి బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా ప్రయాణిస్తాయి. లారీలు, భారీవాహనాలు, ప్రయివేట్ బస్సులు, కమర్షియల్ వాహనాల సహా ఇతర వాహనాలను కొవ్వూరు – రాజమహేంద్రవరం 4 వ వంతెన మీదుగా మళ్లిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ విషయాన్నీ వాహనదారులు గుర్తుపెట్టుకోవాలని.. తమకు సంబంధించిన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..