Treatment Snake: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పాము.. చిట్లిపోయిన దవడకు కుట్లు వేసి చికిత్స చేసిన వైద్యులు..

Treatment Snake: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగు పాముకు కుట్లు వేసి చికిత్స అందించారు వైద్యులు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

Treatment Snake: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పాము.. చిట్లిపోయిన దవడకు కుట్లు వేసి చికిత్స చేసిన వైద్యులు..
Snake

Updated on: Nov 28, 2021 | 6:34 AM

Treatment Snake: రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగు పాముకు కుట్లు వేసి చికిత్స అందించారు వైద్యులు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. సాటి మనిషికి కష్టమొస్తేనే పట్టించుకోని ఈ రోజుల్లో.. గాయపడ్డ విష సర్పానికి చికిత్స చేసి.. అడవిలో వదిలిపెట్టి మంచితనాన్ని చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాసులు. ఐదున్నర అడుగుల సర్పం రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం కిందపడి గాయపడింది. ఈ ఘటనలో పాము దవడ చిధ్రమైంది. గంటసేపు రోడ్డుపై అలాగే ఉండిపోయింది. జైన్ సేవా సమితి అధ్యక్షుడు, సర్ప సంరక్షకుడు విక్రమ్ జైన్ అక్కడికి వచ్చి పామును తీసుకెళ్లి.. వణ్యప్రాణి విభాగం వైద్యుడు ఫణీంద్రకు చూపించారు. చిధ్రమైన దవడ భాగానికి సుమారు గంట సేపు చికిత్స చేసి..12 కుట్లు వేశారు. కాస్త కోలుకున్న తర్వాత మరో సర్ప రక్షకుడు ఈశ్వరరావు నాగుపామును అడవిలో వదిలిపెట్టారు. వీరు చేసిన ఈ పనికి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పామును రక్షించిన తీరు అద్భుతం కదా.

Also read

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?