కరోనా సూపర్‌ స్ప్రెడర్స్‌గా రైతు బజార్లు.. నిబంధనలు పట్టించుకోని జనాలు.. మాస్కులు లేకుండా.!

Corona Super Spreaders: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇవాళ్టి నుంచి....

కరోనా సూపర్‌ స్ప్రెడర్స్‌గా రైతు బజార్లు.. నిబంధనలు పట్టించుకోని జనాలు.. మాస్కులు లేకుండా.!
Corona Super Spreaders

Edited By:

Updated on: May 05, 2021 | 3:27 PM

Corona Super Spreaders: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో 144 సెక్షన్‌ కూడా అమలులో ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అయిదుగురు అంతకు మించి జనం గుమికూడకూడదు. ఇక మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే ఇది అన్ని చోట్లా అమలవుతుందా అంటే?.. అనుమానమేనని అంటున్నారు వ్యాపారులు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో రైతుబజార్లు, చేపల మార్కెట్లు ఉదయం వేళల్లో కిటకిటలాడిపోతాయి. అక్కడ జనాలను నియంత్రిస్తే చాలా వరకు అధికారులు సత్ఫలితాలు సాధించినట్లే. కానీ ప్రజలు ఎప్పటి మాదిరగానే మాస్కలు లేకుండా భౌతికదూరం పాటించకుండా గుమిగూడుతున్నారు. పోలీసులు మైకుల ద్వారా చెబుతున్నప్పటికీ ఎవరూ వినిపించుకోవడం లేదు.

ఇక విజయవాడ చేపల మార్కెట్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌గా పేరు. పక్క జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేపల వ్యాపారినిక ఇక్కడకు వస్తుంటారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వ్యాపారం చేస్తారు. ఇది చాలా ఇరుకైన మార్కెట్‌. 50 మంది చేరితేనే కిటకిటలాడిపోతుంది. ఇక ఆదివారాల్లో అయితే విపరీతమైన రద్ధీ ఉంటుంది. ఒకేసారి కనీసం 100 నుంచి 200 మంది వచ్చేస్తారు. ఇది కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. తాజాగా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ను తరలించాలని వ్యాపారులు కోరుతున్నారు. గతంలో తరహాలో ఎవరికీ ఇబ్బంది లేని విధంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం లేదా గాంధీనగర్‌లోని జింఖానా మైదానంలో ఇస్తే ఉదయం 7 గంటల కల్లా వ్యాపారాలు పూర్తి చేసుకుంటామని వారు చెబుతున్నారు.

ఇప్పటికే కేదారేశ్వరపేట రైతుబజారును ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల మైదానానికి మార్చారు. జనం రద్దీని తగ్గించేందుకు గతంలో సత్యనారాయణపురం రైల్వేకాలనీలో రైతుబజారు పెట్టారు. ఇపుడు ఈ ప్రాంతం కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి చేపల రిటైల్‌ వ్యాపారులకు ఇస్తే వెసులుబాటుగా ఉంటుంది. ఈ ప్రదేశాల్లో పోలీసు బీటు ఏర్పాటు చేసి తరచూ మైక్‌ ప్రచారం ద్వారా మాస్క్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తూ ఉంటే బాగుంటుందని వ్యాపారులంటున్నారు.

Also Read: భారత్ కు కరోనా థర్డ్ వేవ్ ముప్పు.! సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌