AP Rain Alert: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

|

Nov 06, 2023 | 6:39 AM

ఈ ఏడాది సరిపడా వర్షాలు లేకపోవడంతో పలు జిల్లాలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడులో వర్షాల కోసం గ్రామస్థులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్టపై ఉన్న గంగమ్మ ఆలయానికి భారీగా తరలివచ్చిన మహిళలు.. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, వర్షాలు కురిపించాలని పూజలు నిర్వహించారు.

AP Rain Alert: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
andhra pradesh Rain Alert
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అనేక గ్రామాల్లోని ప్రజలు వర్షాలు లేక నీటి కోసం అల్లాడుతున్నారు. ఎండలతో మండిపోతున్నారు. అవును ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఏపీకి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని అలర్ట్‌ జారీ చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం కొన‌సాగుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలోని అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం,సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాధారంగా సాగుచేసిన పలు పంటలకు ఈ వర్షాలతో ఎంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఏడాది సరిపడా వర్షాలు లేకపోవడంతో పలు జిల్లాలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడులో వర్షాల కోసం గ్రామస్థులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్టపై ఉన్న గంగమ్మ ఆలయానికి భారీగా తరలివచ్చిన మహిళలు.. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, వర్షాలు కురిపించాలని పూజలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని.. గంగమ్మ తల్లి కరుణించి వర్షాలు కురిపించాలని వేడుకున్నామని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పొంగమంచు తన ప్రభావం చూపిస్తుండగా.. పగటి పూట ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గటం లేదు. దీంతో ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో కూడా ఏసీలు, కూలర్లతో పాటు ఫ్యాన్‌లకే జనం అత్తుకుపోతున్నారు. మరి ఈ వర్షాలు ఉపసమనం ఇస్తాయేమో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..