AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గోల్డ్ లోన్స్ మేనేజర్ కారులో సినీ ఫక్కీలో చోరీ.. రూ. 40లక్షల విలువ చేసే బంగారంతో ఉడాయించిన దొంగలు..

చిత్తూరులో భారీ చోరీ జరిగింది. ఓ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సినీ ఫక్కీలో బంగారం దొంగల పాలైంది? ఇంతకీ ఇది ఇంటి దొంగల పనేనా? లేక అదను చూసి ఎవరైనా కొట్టేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.   

Andhra Pradesh: గోల్డ్ లోన్స్ మేనేజర్ కారులో సినీ ఫక్కీలో చోరీ..  రూ. 40లక్షల విలువ చేసే బంగారంతో ఉడాయించిన దొంగలు..
Massive Theft In Chittoor
Surya Kala
|

Updated on: Nov 05, 2023 | 7:13 AM

Share

చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 40 లక్షల రూపాయల విలువచేసే బంగారం క్షణాల్లోనే మాయమవడం కలకలం రేపుతోంది. చిత్తూరులోని కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీలో చుట్టు పక్కల చాలా మంది గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ఆ బంగారాన్ని తీసుకుని బయలుదేరిన మేనేజర్ జాన్‌బాబు.. చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్ దగ్గర ఆగాడు. కారు పక్కకు ఆపి హోటల్ గదిలోకి వెళ్లాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు.. జాన్ బాబు కారులో ఉన్న బంగారంతో అక్కడ నుంచి ఉడాయించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 మంది పాల్గొన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇది ఇంటి దొంగల పనేనా.. లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అన్న కోణంలో ప్రత్యేక టీమ్ దర్యాప్తు చేస్తోంది. బ్రాంచ్‌లో ఉండాల్సిన బంగారాన్ని మేనేజర్ ఎందుకు తీసుకెళ్లినట్టు.. ఆ హోటల్‌లోకి ఎందుకెళ్లినట్టు అనేవి ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న డౌట్స్. ఆ కారులో బంగారం ఉన్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది బిగ్ క్వశ్చన్. చోరీ జరిగిన తీరు చూస్తుంటే ఇంటి దొంగల పనే అనే అనుమానం వస్తోంది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు చుట్టుపక్కల గతంలో దొంగతనాలకు పాల్పడిన ముఠాలపై దృష్టి సారించారు అధికారులు. అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుని వేగవంతం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే