Raghu Veera Reddy: అందుకే రాజకీయ అజ్ఞాతం వీడుతున్నా.. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Apr 19, 2023 | 10:01 AM

కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న.. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అజ్ఞాతం వీడుతున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు. కర్నాటక ఎన్నికల వేదికగా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

Raghu Veera Reddy: అందుకే రాజకీయ అజ్ఞాతం వీడుతున్నా.. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Raghu Veera Reddy
Follow us on

కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న.. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అజ్ఞాతం వీడుతున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు. కర్నాటక ఎన్నికల వేదికగా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రఘువీరా రెడ్డి ట్వీట్‌ చేసి.. తన క్రియాశీల రాజకీయ ప్రవేశంపై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. హైకమాండ్ విజ్ఞప్తి మేరకు మళ్లీ వస్తున్నట్లు పేర్కొన్న రఘువీరా.. అందరం కలిసి కర్నాటకలో కాంగ్రెస్‌ని గెలిపిద్దామంటూ పిలుపు నిచ్చారు. ‘‘క్రియాశీలక రాజకీయాలకు రావాలనే మీ కోరికను మన్నిస్తూ, రాహుల్ గాంధీకి అండగా ఉంటూ కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ఈ క్షణం నుంచి కృషి చేయాలని కోరుతున్నాను.’’ అంటూ ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ మాజీ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

మడకశిరలో పొలిటికల్ ఎంట్రీపై మంగళవారం మాట్లాడిన రఘువీరారెడ్డి.. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానంటూ మాజీ మంత్రి వివరించారు. రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని.. కానీ.. ప్రధాని మోడీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని.. ఇది తన మనసును కలచివేసిందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా.. అని ఆలోచించి ప్రజల ముందుకు వచ్చానంటూ రఘువీరా స్పష్టంచేశారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారన్న రఘువీరా.. బెంగళూరు నగర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తనను నియమించినట్లు తెలిపారు. కేడర్ తో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని.. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటానంటూ రఘువీరా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..