AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముందుబాబా మజాకా..! కొండచిలువకే మతి పోగొట్టేశాడు.. వీడియో చూస్తే గజ గజ వణకాల్సిందే..

చాలామంది మద్యం ఎక్కువైతే సోయలేకుండా ప్రవర్తిస్తుంటారు.. మద్యం కిక్కులో ఏం చేస్తారో.. ఎందుకు చేస్తారో తెలియదు.. కొట్టినా.. తిట్టినా.. చీమలు కుట్టినా.. విష పురుగులు కరిచినా.. ఏమీ అర్ధం కాదు.. సోయ ఉండదు.. తాజాగా.. ఓ వ్యక్తి మద్యం మత్తులో కొండచిలువతో పరాచకాలు ఆడుతూ కనిపించడం కలకలం రేపింది.

Viral Video: ముందుబాబా మజాకా..! కొండచిలువకే మతి పోగొట్టేశాడు.. వీడియో చూస్తే గజ గజ వణకాల్సిందే..
Viral News
Shaik Madar Saheb
|

Updated on: Oct 16, 2024 | 10:58 AM

Share

నువ్వు ఎవరైతే నాకేంటి.. మందేస్తే మనం ఎవరిమాట వినం.. మనమే సూపర్ మాన్.. మనమే శక్తిమాన్.. అసలు ఏం చేస్తామో.. ఎందుకు చేస్తామో.. ఏం మాట్లాడుతామో.. ఎటు పోతామో తెలియదు.. మందు కిక్కు అలా చేస్తుంది మరి.. ఇదంతా మామూలే.. ఇప్పుడెందుకు చెబుతున్నారనుకుంటున్నారా..? జర్ర ఆగండి.. ఇది జస్ట్ లీడే.. వార్త కొంచెం ముందుంది.. వాస్తవానికి మద్యం మత్తులో ఉన్న వారు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.. కొందరు ఏవేవో పిచ్చి పనులు చేస్తుంటారు. మరి కొందరు అసలు స్పర్శ లేకుండానే పడుకుంటారు.. అయితే.. తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి.. మంచిగా ముళ్ల పొదల్లో సేద తీరుతుండు.. ఈ క్రమంలోనే.. ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. ఓ కొండచిలువ అటుగా వచ్చి అతనిపైకి ఎక్కింది.. అయినప్పటికీ.. అతనికి ఏం అర్థం కాక ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో చోటుచేసుకుంది.

కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లికి చెందిన లారీ డ్రైవర్ డ్యూటీ దిగి ఫుల్లుగా మద్యం సేవించాడు. మద్యం బాగా ఎక్కడంతో ఇంటికి వెళ్లలేక.. ఓ చోట అరుగుపై కూర్చున్నాడు. మద్యం మత్తులో తూగుతూ ఉండిపోయాడు. అయితే పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కింది.. అయినప్పటికీ.. అతనికి ఏమీ తెలియలేదు. ఇలా కొంతసేపటి తర్వాత లారీ డ్రైవర్‌ పై ఉన్న కొండచిలువను స్థానికులు చూశారు.. అది కొండ చిలువ అంటూ కేకలు వేసి అతని చెప్పినాప్పటికీ.. మద్యం మత్తులో ఉన్న అతను పట్టించుకోలేదు.. పైగా దానితోనే మాట్లాడుతూ కనిపించాడు.. చివరకు స్థానికులు కట్టెల సహాయంతో కొండచిలువను పక్కకు లాగేశారు. ఒంటిపై కొండచిలువ నాట్యం చేస్తున్నా లారీ డ్రైవర్‌కు స్పర్శ తెలియకపోవడంతో ఇలా ఉన్నాడేంటి అంటూ గ్రామస్తులు నవ్వుకున్నారు.. కాగా, ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

సాధారణంగా మద్యం తాగితే మందు బాబులు ఎవ్వరి మాట వినరు.. ఇంకా జంతువుల గురించి ఇంకేం ఆలోచిస్తారులే అంటూ అంతా నవ్వుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us