AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు

Watch: మరో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు.. కాకాణి కీలక వ్యాఖ్యలు

Janardhan Veluru
|

Updated on: Oct 15, 2024 | 7:22 PM

Share

ఏపీలో తదుపరి ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండేళ్లే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. ఏపీలో 2027లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.

ఏపీలో మరో రెండేళ్లే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.  జమిలి ఎన్నికలతో ఏపీలో 2027లోనే ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుని అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించకూడదని వార్నింగ్ ఇచ్చారు. మద్యం టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నిబంధనలన్నీ పేపర్లకే పరిమితం అయ్యాయని.. కలెక్టర్లు సైతం ఏం చేయలేని స్థితిలో ఉన్నారని కాకాణి అన్నారు. మద్యం షాపుల లాటరీలో 90 శాతం టీడీపీ నేతలకే దక్కాయని వ్యాఖ్యానించారు. ముందస్తు ప్రణాళిక మేరకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో లాటరీ జరిగిందని ఆరోపించారు.

Published on: Oct 15, 2024 07:20 PM