Andhra News: కార్పొరేట్ మాల్స్ లేని గోల్డెన్‌సిటీ.. బంగారం అమ్మకాల్లో రెండో ముంబై.. ఎక్కడో కాదు మన దగ్గరే..
ప్రొద్దుటూరు బంగారం వ్యాపారానికి 150ఏళ్ల చరిత్ర ఉంది. మొదట 20 మంది స్థానికులు ఈ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు... కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా బంగారు కొనుగోళ్ల కోసం ఇక్కడికి వస్తుంటారు.

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారానికి 150ఏళ్ల చరిత్ర ఉంది. మొదట 20 మంది స్థానికులు ఈ బంగారం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వ్యాపారులతో పాటు స్వర్ణకారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. బంగారు ఆభరణాలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు మంచి నైపుణ్యం సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు… కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా బంగారు కొనుగోళ్ల కోసం ఇక్కడికి వస్తుంటారు. 1960లో అప్పటి జనతా ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం దేశంలో లైసెన్సు లేకుండా ఏ ఒక్కరూ బంగారు దుకాణాలు నిర్వహించకూడదు. రాయలసీమలోని కడపతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కూడా బంగారు దుకాణాలు నిర్వహించుకునేవారు. వీరంతా లైసెన్సు లేకుండా వ్యాపారాలు చేసేవారు. కానీ ఒక్క ప్రొద్దుటూరులో మాత్రం అప్పట్లోనే లైసెన్సు కలిగిన దుకాణాలు ఉండేవి. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు. ఇక్కడి నుంచి బంగారు కొనుగోలు చేసి వారి ప్రాంతాల్లో విక్రయించేవారు. నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఆ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకునేవారు. పెద్ద మొత్తంలో బంగారాన్ని దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. ఆ రోజు నుంచి రెండో ముంబైగా, పసిడిపురిగా ప్రొద్దుటూరును పిలుస్తారు.
ప్రొద్దుటూరు బంగారు వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పరిశ్రమగా వెలుగొందుతోంది. ఒకప్పుడు మెయిన్‌బజార్‌లో మాత్రమే దుకాణాలు ఉండగా ప్రస్తుతం 10 వీధులకు దుకాణాలు, వర్క్ షాపులు విస్తరించాయి. సుమారు 1600కు పైగా బంగారు విక్రయించే దుకాణాలు, 1500కు పైగా వర్క్ షాపులు ఉన్నాయి. 5వేల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాలకు దీటుగా ఇక్కడ పసిడి విక్రయాలు జరుగుతున్నాయి. కేవలం నాణ్యతను మాత్రమే నమ్ముకున్నారు ఇక్కడి వ్యాపారస్తులు.
ప్రొద్దుటూరుతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు ఇక్కడ పని చేస్తున్నారు. మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇక్కడి స్వర్ణకారులు చేసిన ఆభరణాలకు మంచి గుర్తింపు ఉండేది. బెంగాల్ రాష్ట్రానికి చెందిన స్వర్ణకారులు అత్యధికంగా ప్రొద్దుటూరులో పని చేస్తున్నారు. కోరిన డిజైన్లలో నగలు తయారు చేయడంలో ఇక్కడి స్వర్ణకారులు సిద్ధహస్తులు.
వివాహ ముహుర్తాలు, పండుగలు, అక్షయ తృతీయ రోజున ప్రొద్దుటూరు గోల్డ్ మార్కెట్ నూతన శోభను సంతరించుకుంటుంది. ఆన్‌లైన్‌ధరల ప్రకారం బంగారు విక్రయాలు నిర్వహిస్తారు. దీంతో ఏ షాపునకు వెళ్లినా ఒకటే ధర ఉంటుంది. అందువల్ల ప్రొద్దుటూరు బంగారాన్ని అందరూ ఇష్టపడతారు. దీంతో ప్రొద్దుటూరు ఫుల్ ఫేమస్ అయ్యింది. పసిడిపురిగా పేరుగాంచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




