Andhra Pradesh: నేడు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలక భేటీ.. అందరి దృష్టి ఈ భేటీపైనే.. ఎందుకంటే..
Andhra Pradesh: ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. తమ వద్ద పెండింగులో ఉన్న సభా హక్కుల ఉల్లంఘన..
Andhra Pradesh: ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ కానుంది. తమ వద్ద పెండింగులో ఉన్న సభా హక్కుల ఉల్లంఘన కేసులపై చర్చించనుంది. అందులో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కూన రవి కుమార్, మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తమ వద్ద ఉన్న పిటిషన్లపై చర్చించనుంది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ లు గత ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హజరుకావాల్సి ఉన్నా.. అచ్చన్నాయుడు మాత్రం ప్రివిలేజ్ కమిటీకి లేఖ ద్వారా తన అందుబాటులో లేనని సమాచారం ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికూమార్ మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణకు డుమ్మా కొట్టారు. దీనిని ప్రివిలేజ్ కమిటీ సీరియస్ గా తీసుకుంది. కూన రవి కుమార్ వ్యవహారాన్ని ధిక్కారంగా భావిస్తూ అయన పై తదుపరి సమావేశంలో చర్యలపై నిర్ణయం తీసుకోవాలని గత ప్రివిలేజ్ కమిటీ భేటీలో నిర్ణయించారు.
కాగా, స్పీకర్ తమ్మినేని సీతారాంపై వివిధ సందర్భాల్లో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఇద్దరూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. అచ్చెన్నాయుడుపై జోగి రమేష్, కూన రవి కుమార్‌పై ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారం అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. స్పీకర్ పై ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారనే అంశంపై ప్రివిలేజ్ కమిటీ అచ్చన్నాయుడు, కూనరవి కుమార్ లపై విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందివ్వాలని ప్రివిలేజ్ కమిటీని గతంలో కోరారు. దీనిపై రామానాయుడు కోరిన విధంగా సమాచారం పంపింది కమిటీ. అలాగే తాను చేసిన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన పరిధిలోకి ఎలా వస్తాయో చెప్పాలని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరగా.. ఆ మేరకు సమాచారాన్ని ఆయనకు కూడా పంపింది ప్రివిలేజ్ కమిటీ. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగనున్న ప్రివిలేజ్ కమిటీ సమావశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా మారింది.
Also read:
Pani Puri: చిరు వ్యాపారి గొప్పతనం.. ఆడపిల్ల పుట్టిందని రూ.50 వేల ఖర్చు.. అసలేం చేశాడంటే..?
Horoscope Today: ఈ రాశి వారికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు.. అనవసరమైన ఖర్చులు..!