Visakha Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పాటు, ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ఏకమై గొంతెత్తుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. అయితే తాజాగా రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగుతుందంటే రాజీనామాలకూ సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేదే లేదన్నారు. స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామాలకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే విశాఖ ఉక్కు సెంటిమెంట్‌ను అర్థమయ్యేలా వివరిస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆర్థిక వనరుగా కాకుండా.. ఆంధ్రుల సెంటిమెంట్‌గా భావించాలని కోరారు.
ఇదిలాఉంటే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను వందశాతం ఉపసంహరించుకుంటామని, ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మొదలు యావత్ ఆంధ్ర రాష్ట్రం భగ్గమంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నాటి నినాదాన్ని మళ్లీ అందిపుచ్చుకుంది కార్మికలోకం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రకటన విడుదల మొదలు.. కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార, విపక్ష నేతలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కార్మిక సంఘాలు, వైసీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read:
గుంటూరులో సీఐ డెత్ మిస్టరీలో విభిన్న కోణాలు.. సీసీ ఫుటేజ్ సాయంతో కాస్త స్పష్టత.. వివరాలు ఇవే