Andhra Pradesh: ప్రాణాలు తీస్తున్న ట్రావెల్స్ బస్సులు.. రెప్పపాటులో ఘోరం.. ఆటోలో వెళ్తుండగా..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు బీభత్సం సృష్టిస్తున్నారు.. ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు అడ్డదిడ్డంగా బస్సులు నడుపుతూ ఎక్కడి పడితే అక్కడ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.. గమ్యస్థానాలకు తొందరగా వెళ్లాలనే ఆత్రుతో లేక ప్రమాదం జరిగితే మాకేమవుతుందిలే అనే అహంకారమో.. తెలియదు గానీ బస్ డ్రైవర్లు అధిక స్పీడ్‌తో బస్సులను నడిపి ఆటోలను ద్విచక్ర వాహనాలను గుద్దేసుకుంటూ నిత్యం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. తాజాగా ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పోరుమామిళ్ల కాలువ కట్ట సమీపంలో ఆటోను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది..
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. గాయాల పాలైన వారిని 108 అంబులెన్స్ ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు..
మృతి చెందిన వారంతా రామేశ్వరం గ్రామానికి చెందిన 55 సంవత్సరాల రోశయ్య, 65 సంవత్సరాల సుబ్బయ్యగా గుర్తించారు.. వీరంతా రామేశ్వరం నుంచి ఆటోలో వస్తున్నారు.. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, రోడ్డు రవాణా శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..