President Murmu at Srisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది, తెలంగాణ గవర్నర్ తమిళిసై

|

Dec 26, 2022 | 4:16 PM

మల్లికార్జున స్వామివారి ఆలయ రాజగోపురం వద్ద రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళ సై  కు పూర్ణకుంభంతో అర్చకులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన తదితరులు స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు ద్రౌపది.

President Murmu at Srisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది, తెలంగాణ గవర్నర్ తమిళిసై
President Murmu At Srisailam
Follow us on

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో పర్యటించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలీ ప్యాడ్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదికి  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ . ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా సహా పలువురు ఘన స్వాగతం పలికారు. ముందుగా శీశైలంలోని సాక్షి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ఈ సందర్భంగా మల్లికార్జున స్వామివారి ఆలయ రాజగోపురం వద్ద రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళ సై  కు పూర్ణకుంభంతో అర్చకులు, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన తదితరులు స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబిక దేవికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు ద్రౌపతి. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు.  శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో రు. 43.08 కోట్లతో ప్రసాద్ స్కీం కింద సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ప్రారంభించారు. శ్రీశైలం పర్యటన అనంతరం శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి