AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఖాకీ వనంలో గంజాయి మొక్క… ఏసిబికి చెక్కిన అవినీతి తిమింగలం

గత నెల మార్చి 29వ తేదిన మేదరమెట్లకు శ్రీనివాసరావును పిలిపించిన ఎస్‌ఐ, అక్కడ కారులో కూర్చుని 30 వేలు లంచం తీసుకున్నాడు... ఆ తరువాత మిగిలిన 70 వేల రూపాయల కోసం శ్రీనివాసరావును పలుమార్లు హెచ్చరించాడు. బేలో వ్యాపారం చేసుకుంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు తల్లి గ్రామంలో సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామంలో ఓ పొగాకు బ్యార్నీ అనుమతులు...

AP News: ఖాకీ వనంలో గంజాయి మొక్క... ఏసిబికి చెక్కిన అవినీతి తిమింగలం
Acb
Fairoz Baig
| Edited By: Narender Vaitla|

Updated on: Apr 02, 2024 | 7:32 PM

Share

ప్రకాశంజిల్లా టంగుటూరు ఎస్‌ఐ అందె నాగేశ్వరరావు ఓ సివిల్‌ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు… టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంకు చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వలపన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు… ఓ సివిల్‌కేసు విషయంలో శ్రీనివాసరావును పలిపించిన ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసులో ఇబ్బందులు లేకుండా చేయాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

గత నెల మార్చి 29వ తేదిన మేదరమెట్లకు శ్రీనివాసరావును పిలిపించిన ఎస్‌ఐ, అక్కడ కారులో కూర్చుని 30 వేలు లంచం తీసుకున్నాడు… ఆ తరువాత మిగిలిన 70 వేల రూపాయల కోసం శ్రీనివాసరావును పలుమార్లు హెచ్చరించాడు. బేలో వ్యాపారం చేసుకుంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు తల్లి గ్రామంలో సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామంలో ఓ పొగాకు బ్యార్నీ అనుమతులు లేకుండా కడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదును విచారించే క్రమంలో ఎస్‌ఐ నాగేశ్వరరావు గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు పెట్టకుండా ఉండేందుకు, ఒకవేళ కేసు పెడితే అరెస్ట్‌ చేయకుడా 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు.

అయితే ఇప్పటికే 30 వేలు లంచం ఇచ్చిన శ్రీనివాసరావు ఇంకా 70 వేలు లంచం ఇచ్చేందుకు ఇష్టంలేక ఏసిబి అధికారులను ఆశ్రయించడంతో ఎస్‌ఐ లంచావతారం వెలుగులోకి వచ్చింది. టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు డిమాండ్‌ చేసిన విధంగా ఇప్పటికే ఇచ్చిన 30 వేలు కాకుండా మరో 70 వేలు లంచం ఇచ్చేందుకు ఇష్టంలేని కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు ఒంగోలులోని ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు… ఫిర్యాదు తీసుకున్న ఏసిబి డిఎస్‌పి వి. శ్రీనివాసరావు తన సిబ్బందితో రంగంలోకి దిగారు.

కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర 70 వేలు లంచం తీసుకునేందుకు టంగుటూరులోని చెల్లెమ్మతోటకు రమ్మని ఎస్‌ఐ నాగేశ్వరరావు కోరారు… అక్కడ కారులో కూర్చుని 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అదికారులు దాడి చేసి పట్టుకున్నారు… ఎస్‌ఐ దగ్గర ఉన్న 70 వేలను స్వాధీనం చేసుకున్నారు… అనంతరం టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లోని కేసుకు సంబంధించిన రికార్డులను స్వాదీనం చేసుకుని ఎస్‌ఐ నాగేశ్వరరావును అరెస్ట్‌ చేశారు… ఎస్‌ఐని రేపు నెల్లూరు ఏసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఒంగోలు ఏసిబి డిఎస్‌పి వి. శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌