Andhra Pradesh: భారీ సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్.. ఆదమరిస్తే చిక్కులు తప్పవంటున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకోనుంది.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగానికి పైగా నిలిచిపోయింది..
Andhra Pradesh Power problems: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో చిక్కుకోనుంది.. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగానికి పైగా నిలిచిపోయింది.. ఇదే సమయంలో ఫీక్ స్టేజ్ లో విద్యుత్ యూనిట్ దాదాపు 15 రుపాయిలు పెట్టి కోనుగోలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దీనస్థితిలో ఉండటంతో.. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు.. దీంతో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి పదిన్నర వరకు వినియోగ దారులు ఏసీలు ఆఫ్ చేసి ఉంచాలని ఏపి ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది..
కేంద్రం ప్రభుత్వ ముందు చూపులేనితనం.. విద్యుత్ పై పర్యవేక్షణ లోపమో గాని.. దేశం మొత్తం తీవ్ర విద్యుత్ సంక్షోభంలోకి వేళ్లే పరిస్థితి దాపురించింది.. దీని ప్రభావం ఏపీ పైన కూడా పడింది..రాష్ట్రంలో మొత్తం మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అవుతోంది. అయితే, విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్ టన్నులు బోగ్గు నిల్వలు ఉండాలి.. కానీ ప్రస్తుతం 20 వేల నుండి 40 వేల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే రోజు వారిగా బోగ్గు నిల్వలు ఉన్నాయి.. విజయవాడలోని నార్లతాతారావు థర్మల్ స్టేషన్ లో రోజుకు 24,500 టన్నులు బోగ్గు అవసరం ఉంటుంది. అయితే, ప్రస్తుతం అక్కడ 13,600 టన్నులు మాత్రమే నిల్వ ఉంది..అదే సమయంలో రాయలసీమ థర్మల్ కేంద్రంలో రోజుకి 16,800 టన్నులు కావాలి. కానీ అక్కడ 69,100 టన్నులు నిల్వ ఉంది..ఇది నాలుగు రోజులకు సరిపోతుంది.. ఇక, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఉన్న థర్మల్ కేంద్రంలో రోజుకు 13,600 టన్నులు నిల్వలు అవసరం కాగా.. అక్కడ ప్రస్తుతం 89,200 టన్నులు నిల్వలు ఉన్నాయి..అది వచ్చే 7 రోజులకు సరిపోతుంది..ఏపిలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 5100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తో నడుస్తున్నాయి..అయితే, ఏపిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణితోపాటు కోల్ ఇండియా నుండి బొగ్గు సరఫరా అవుతుంది…
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 180 నుండి 190 మిలియన్ యూనిట్లుగా ఉంది. దాని సరఫరా పరిస్థితి చూస్తే.. ప్రస్తుతం 40 మిలియన్ యూనిట్లు ఏపి జన్కో ద్వారా,30-35 మిలియన్ యూనిట్లు కేంద్రం విద్యుత్ స్టేషన్ల నుండి.. మరో 40 మిలియన్ యూనిట్లు బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తున్నారు.. మరో 15 మిలియన్ యూనిట్లు హైడెల్ విద్యుత్ కేంద్రాల నుండి సరఫరా అవుతోంది..పవన్ విద్యుత్ 25 మిలియన్ యునిట్లు ఉత్పత్తి అవుతుంది..కానీ, గత రెండు రోజులుగా కనీసం 2 మిలియన్ యూనిట్లు కూడా ఉత్పత్తి జరగడంలేదు. మనకు సుమారు 90 మిలియన్ యూనిట్లకు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారానే వస్తుంది..ప్రస్తుతం బొగ్గు నిల్వలు సరిగా లేకపోవడంతో.. దాదాపు సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది..ప్రస్తుతం విద్యుత్ సంక్షోభానికి కేంద్రం విధానాలనే అన్నది కీలక అంశం..
ఇక, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేయడం..రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుంది..గత నెల 16న ఒక యూనిట్ ధర బహిరంగ మార్కెట్‌లో ఉంటే. .అది ఈ నెల 5నాటికి యూనిట్ ధర 14.60 రుపాయిలకు చేరింది..ఇదే క్రమంలో రోజు వారిగా విద్యుత్ పీక్ డిమాండ్ సమయంలో గంట గంటకు ధర మారుతుంది.. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలపై తీవ్ర ఆర్ధిక భారం పడుతుంది.. 2019-2020, 2020-2021 రెండు ఆర్ధిక సంవత్సరాలకు గాను విద్యుత్ సంస్థలకు 34 వేల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం బకాలులు ఉండగా..వాటిల్లో సుమారు 10 వేల కోట్ల మేర చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి..ఇదే సమయంలో ఏపీ జెన్కోకి బకాయులు గుదిబండగా మారాయి. తెలంగాణా నుండి 6200 కోట్లు బకాయిలు ఏపి జెన్కోకి రావాల్సి ఉంది..ఇదే సమయంలో బొగ్గు సరఫరా చేస్తున్న మైనింగ్ సంస్థలకు ఏపీ జెన్కో 1500 కోట్ల రుపాయిలు చెల్లించాలి.. వీరికి పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తే తప్పా..వారు బొగ్గు సరఫరా చేయని పరిస్థితి..దీనికి తోడు ఇప్పుడు బొగ్గు కొరత ప్రస్తుత ఏపిలో విద్యుత్ సంక్షోభానికి అనేక కారణాలు చుట్టుముట్టాయి…
ప్రస్తుత విద్యుత్ సంక్షోభం నుండి బయటపడాలంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి పదిన్నర వరకు ఏసీలు, ఇతరత్రా విలావంతమైన విద్యుత్ ఉపకరణాలు బంద్ చేయాలని విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీని ద్వారా రోజుకు కనీసం 10 మిలియన్ యూనిట్లు కలిసివస్తుందని విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత సంక్షోభానికి కేంద్రం విద్యుత్ విధానాలు కూడా ఒక కారణమైతే, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గించి సాంప్రదాయేత ఇంధనాన్ని ప్రోత్సహించాలని కేంద్రం చేసిన సూచనలతో క్రమంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాయి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలంటే.. వాటితో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే విద్యుత్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కుంటుందో వేచి చూడాలి..
మరోవైపు, కరెంట్ సంక్షోభం ముంచుకొస్తోందని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. 25 రూపాయలు పెట్టినా యూనిట్ విద్యుత్ దొరకని పరిస్థితి ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కరెంట్ కోతలు తప్పకపోవచ్చని చెప్పారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు సజ్జల.
Read Also… Telangana 10th Class: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఈ ఏడాది నుంచి..