Visakhapatnam: డ్రమ్ములో డెడ్ బాడీ.. సంవత్సరం పాటు అందులోనే.. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు..
విశాఖ మధురవాడలో నీళ్ల డ్రమ్ములో మృతదేహం.. కేసులో మిస్టరీ వీడింది. కొమ్మాది వికలాంగుల కాలనీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సమయంలో అసలు విషయాలు..
విశాఖ మధురవాడలో నీళ్ల డ్రమ్ములో మృతదేహం.. కేసులో మిస్టరీ వీడింది. కొమ్మాది వికలాంగుల కాలనీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సమయంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయిన మహిళ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాగా పోలీసులు గుర్తించారు. ఇంటిని అద్దెకు తీసుకున్న రిషి అనే వ్యక్తిపై అనుమానంతో విచారణ జరిపిన పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి. మధురవాడ లోని కొమ్మాదిలో రిషి అనే వ్యక్తి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అయితే అద్దెకు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోయాడు. దాదాపు ఏడాది గడుస్తున్నా అతను తిరిగిరాకపోవడంతో ఇంటి యజమాని తలుపుల తాళం పగలగొట్టి లోపలకు వెళ్లాడు. ఆ సమయంలో రూమ్ లో ఉన్న ఓ నీటి డ్రమ్ములో అస్థి పంజరాన్ని గుర్తించాడు. యజమాని రమేశ్ వెంటనే అలర్ట్ అయ్యి.. పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని అస్థి పంజరాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప్టటారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఇంటి యజమాని రమేశ్ శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రిషి అనే వ్యక్తికి 2020లో ఇల్లు అద్దెకు ఇచ్చాడు. రిషి నగరంలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ భార్యతో కలిసి రెండు నెలలు పాటు ఆ ఇంట్లో ఉన్నాడు. 2021 జూలైలో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. భార్యను ప్రసవానికి తీసుకెళ్తున్నట్లు ఇంటి ఓనర్ కు చెప్పాడు. అలా వెళ్లిపోయిన రిషి సంవత్సరం గడుస్తున్నా తిరిగి రాలేదు. ఈ క్రమంలో అతను రాకపోవడంతో యజమాని గదిని వేరే వారికి ఇచ్చేందుకు శుభ్రం చేయిస్తున్నాడు. అదే సమయంలో ఓ మూలన ఉన్న వాటర్ డ్రమ్ ను ఓపెన్ చేస్తే అందులో పుర్రె, ఎముకలు, పొడవాటి వెంట్రుకలు కనిపించాయి. దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు రిషి వివరాలపై ఆరా తీశారు.
అయితే.. డెడ్ బాడీ రిషీ భార్యది కాదని నిర్ధారించుకున్న పోలీసులు.. అసలు మృతదేహం ఎవరిది అన్న కోణంలో దర్యాఫ్తు చేసి వివరాలు రాబట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ మృతదేహంగా గుర్తించారు. అసలు మహిళ అక్కడికి ఎందుకు వచ్చింది? నిందితుడితో ఏంటి సంబంధం? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. డ్రమ్ములో అస్థిపంజరం బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం