AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది.. కానీ..!

కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది. అయితే ఆ తల్లి అనారోగ్యం ఆమెతో ఉన్న డబ్బు పై ఆశపడ్డ ఎదురింటి యువకుడి ఆలోచన మరోలా మారింది. పక్కా ప్లాన్ వేసి ఆ తల్లిని హతమార్చేందుకు కారణమైంది.

Andhra Pradesh: కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది.. కానీ..!
Madanapalli Murder Case
Raju M P R
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 09, 2024 | 10:51 AM

Share

కన్న కొడుకు దూరంగా ఉండడంతో ప్రేమను పంచింది. అయితే ఆ తల్లి అనారోగ్యం ఆమెతో ఉన్న డబ్బు పై ఆశపడ్డ ఎదురింటి యువకుడి ఆలోచన మరోలా మారింది. పక్కా ప్లాన్ వేసి ఆ తల్లిని హతమార్చేందుకు కారణమైంది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం రేకెత్తించిన హత్య కేసులో నిందితుని అరెస్టు చేయడంతో నిప్పులాంటి నిజం బయట పడింది.

స్వర్ణకుమారి.. మదనపల్లి లోని జగన్ కాలనీలో నివాసం ఉంటున్న సీఐ తల్లి. కొడుకు నాగేంద్రప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తల్లి కొడుకు లాంటి కిరాతకుడి చేతిలో హతమైంది. వృత్తి రీత్యా సీఐ నాగేంద్ర ప్రసాద్ ధర్మవరంలో ఉంటే తల్లి స్వర్ణకుమారి మాత్రం మదనపల్లిలో ఉంటుంది. ఒంటరిగా ఉంటున్న 60 ఏళ్ల స్వర్ణ కుమారి అదే వీధిలో ఉన్న వెంకటేష్ అనే యువకుడిని చేరదీసింది.

సొంత కొడుకు దూరంగా ఉండటంతో ఏదైనా పని ఉంటే కొడుకు వయసు ఉన్న వెంకటేష్‌తో కావలసిన పనులు చేయించేది. ఇలా స్వర్ణకుమారి ఇంటికి దగ్గరైన వెంకటేష్ ఆమెను నమ్మించాడు. అయితే ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు నగదు కోసం ఆశపడ్డాడు. స్వర్ణ కుమారి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు పక్కా ప్లాన్ అమలు చేశాడు. సెప్టెంబర్ 28వ తేదీన ఒక స్వామీజీ కాశీ నుంచి వచ్చాడని అతని వద్ద చూపిస్తే ఎలాంటి రోగాలైనా మాయం అవుతాయని నమ్మించాడు. వెంకటేష్ మాయ మాటల్ని నమ్మిన స్వర్ణ కుమారి, ఆ యువకుడి వెంట బైక్ పై వెళ్లిపోయింది.

ఇంకేముంది అనుకున్న ప్లాన్ అమలు చేశాడు వెంకటేష్. నిద్ర మాత్రలను కలిపి తీర్థంగా స్వర్ణ కుమారికి తాగించాడు. స్వర్ణకుమారి మత్తులో జారుకోగానే సుత్తితో తలపై కొట్టి చంపాడు. ఆమె వద్ద ఉన్న బంగారు నగలు తీసుకొని స్థానికంగా ఒక ఫైనాన్స్ సంస్థలో కుదువ పెట్టి రూ. 4 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత డెడ్ బాడీని గోనెసంచిలో కుక్కి అయోధ్య నగర్ లోని స్మశాన వాటికకు తరలించారు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లెలో ఉంటున్న అనిల్ అనే మరో స్నేహితుడి సాయంతో స్వర్ణ కుమారి మర్డర్ ప్లాన్ పూర్తి చేశాడు.

స్వర్ణకుమారి హఠాత్తుగా మాయం కావడంతో కొడుకు నాగేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం మదనపల్లి తాలూకా పీఎస్ లో స్వర్ణ కుమారి కొడుకు నాగేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరికి స్వర్ణకుమారితో సన్నిహితంగా మెలిగిన వెంకటేష్ అసలు నిందితుడని నిర్ధారించారు. వెంకటేష్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వెంకటేష్ నుంచి అసలు నిజాలను రాబట్టారు. అనిల్ అనే స్నేహితుడి సహాయంతో స్వర్ణ కుమారిని హతమార్చిన విషయాన్ని తేల్చారు. స్వర్ణ కుమారుని హత్య చేసి గోనెసంచిలో కుక్కి పూడ్చిపెట్టిన స్మశానం వద్దకు వెంకటేష్ ను డెడ్ బాడీని పోలీసులు బయటకు తీశారు. స్వర్ణకుమారి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. భర్త రెండో పెళ్లి చేసుకుని దూరమైనా, కొడుకు నాగేంద్రప్రసాద్ ను కష్టపడి చదివించి సీఐని చేసిన స్వర్ణకుమారి దారుణ హత్యకు గురి కావడం స్థానికుల కంట తడి పెట్టించింది.

ఇక నమ్మినవాడి నరరూప రాక్షసుడుగా మారి అమ్మలా ఆదరించిన స్వర్ణ కుమారిని హతమార్చగా మదనపల్లిలో జరిగిన ధర్మవరం సిఐ తల్లి హత్య కేసును పోలీసులు చేధించారు. ఇక స్వర్ణకుమారి హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్ ను అరెస్టు చేసిన పోలీసులు హత్యకు సహకరించిన అనిల్, అతని తల్లి రమాదేవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..