AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ..? ఐ ఫోన్ కోసమే వేట మొదలు పెట్టిన పోలీసులు..!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దాడిలో పాల్గొనటం, పాల్గొనేలా ప్రేరేపించడం వంటి అంశాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ లు చేస్తూ వచ్చారు.

Andhra Pradesh: ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ..? ఐ ఫోన్ కోసమే వేట మొదలు పెట్టిన పోలీసులు..!
Cell Phone
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 21, 2024 | 4:04 PM

Share

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. దాడిలో పాల్గొనటం, పాల్గొనేలా ప్రేరేపించడం వంటి అంశాల ఆధారంగా పోలీసులు అరెస్ట్ లు చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే మాజీ పార్లమెంటు సభ్యులు నందిగాం సురేష్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ ఆరో తేదీన నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని చేసి మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.

కోర్టు సురేష్ కు మొదట పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత దాన్ని మరో పద్నాలుగు రోజులు పాటు పొడిగించింది. సురేష్ అరెస్ట్ అయిన తర్వాత ఇదే కేసులో వైసీపీ ముఖ్య నేతలను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘరాం, దేవినేని అవినాష్, గవాస్కర్ మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో 2021 అక్టోబర్ లో దాడి జరిగిన సమయంలో నేతల ఉపయోగించిన ఫోన్లు ఇవ్వాలంటూ పోలీసులు అడిగారు. అయితే, అప్పడు తాము ఉపయోగించిన పోన్లు ప్రస్తుతం లేవంటూ నేతలు సమాధానాలు చెప్పారు. దీంతో పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్న పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తామని నేతలు చెప్పి పంపించారు.

ఇది ఇలావుండగా జ్యూడిషీయల్ కస్టడిలో ఉన్న నందిగాం సురేష్ రెండు రోజుల పాటు పోలీసులు కస్టడికి తీసుకున్నారు. పోలీసు విచారణలో కూడా సురేష్ వాడిన ఐ-ఫోన్ గురించి ప్రశ్నించారు. దీంతో సురేష్ తన ఐ-ఫోన్ ఇంట్లోనే ఉందని సమాధానం ఇచ్చారు. సురేష్ సమాధానం విన్న తర్వాత పోలీసులు మరోసారి సురేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఫోన్‌ను మంగళగిరి పోలీసులకు స్వాధీనం చేయాలంటూ సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి వచ్చారు. కేసు దర్యాప్తులో సెల్ ఫోన్ కీలకంగా మారిందని పోలీసుల అంటున్నారు.

టీడీపీ కార్యాలయం దాడికి ముందే నేతల మధ్య జరిగిన ఫోన్ కాల్స్ పై ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్న అంశాన్ని కోర్టు రుజువు చేసేందుకు నేతల ఫోన్ కాల్ డేటాను తీస్తున్నారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే అరెస్టైన మాజీ ఎంపీ నందిగాం సురేష్ మొబైల్ ఫోన్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్