Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?

|

Mar 25, 2021 | 12:09 PM

TDP Leader Paritala Sriram: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం కీలక నేత పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ

Paritala Sriram: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
Tdp Leader Paritala Sriram
Follow us on

TDP Leader Paritala Sriram: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం కీలక నేత పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు పరిటాల శ్రీరామ్ జిల్లాలలోని చెన్నేకొత్తపల్లి స్టేషన్ పరిధిలోని ముష్టికోవెల అనే గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో.. శ్రీరామ్‌తోపాటు.. మరికొందరు తనపై దాడి చేశారంటూ ముష్టికోవెల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరాముడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు పరిటాల శ్రీరామ్‌తో పాటు ముష్టికోవెల గ్రామానికి చెందిన తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. దీనిపై పరిటాల శ్రీరామ్ స్పందించారు. కక్షసాధింపులో భాగంగానే కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకపోయినా అక్రమంగా కేసులు పెట్టారంటూ ఆరోపించారు. ఆ గ్రామంలో పార్టీ కార్యకర్తల్ని పరామర్శించి వెంటనే వచ్చామన్నారు. అయినా తన సమక్షంలోనే దాడి జరిగిందంటూ కేసులు పెట్టించడం బాధకరమంటూ శ్రీరామ్ తెలిపారు.

Also Read:

Family Sucide: మంచిర్యాలలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య