Andhra Pradesh: మద్యం మత్తులో పోలీసులనే కొట్టారు.. ఆ తరువాత సీన్ చూస్తే..

Andhra Pradesh: ఒంగోలులో నడిరోడ్డుపై నలుగురు యువకులు నానా హంగామా చేశారు. మద్యం మత్తులో బైక్‌పై నలుగురు వెళుతూ ఆటోను ఢీకొట్టారు. అనంతరం ఆ ఆటో డ్రైవర్‌నే బెదిరింపులకు..

Andhra Pradesh: మద్యం మత్తులో పోలీసులనే కొట్టారు.. ఆ తరువాత సీన్ చూస్తే..
Ap News

Updated on: Mar 07, 2022 | 8:08 PM

Andhra Pradesh: ఒంగోలులో నడిరోడ్డుపై నలుగురు యువకులు నానా హంగామా చేశారు. మద్యం మత్తులో బైక్‌పై నలుగురు వెళుతూ ఆటోను ఢీకొట్టారు. అనంతరం ఆ ఆటో డ్రైవర్‌నే బెదిరింపులకు పాల్పడ్డాడు. రోడ్డుపై ట్రాపిక్‌కు అంతరాయం కలిగిస్తూ కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. వెంటనే సమాచారం అందుకున్న ఇద్దరు బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఇద్దరు యువకులు పోలీసులపై తిరగబడ్డారు. ఓ కానిస్టేబుల్‌పై యువకుడు చేయిచేసుకున్నాడు. దీంతో బిత్తరపోయిన ఆ ఇద్దరు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మద్యం మత్తులో హంగామా చేస్తున్న యువకులు తమకు అలవికావడం లేదని తెలపడంతో మరికొంత మంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు యువకులు పారిపోయారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు యువకులను ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి డాక్టర్లతో పరీక్షలు చేయించారు. యువకులు ఫుల్లుగా మద్యం తాగి ఉన్నట్టు డాక్టర్లతో రిపోర్ట్‌ తీసుకుని అనంతరం యువకుల చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్‌ నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం యువకులను రిమాండ్‌కు తరలించారు ఒంగోలు టూటౌన్‌ సిఐ రాఘవ తెలిపారు.

Also read:

Exit Polls Live: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వస్తుంది.? ఓటరు దేవుళ్లు ఎవరి వైపు మొగ్గు చూపారు..(Video)

Russia Ukraine crisis: భారీగా పతనమైన రూపాయి.. క్రూడ్‌ ఆయిల్ ధర పెరుగుదలే కారణమా..

Viral Video: స్టైలిష్‌గా డ్రైవింగ్ చేసి ఫేమస్ అవ్వాలనుకున్న ముద్దుగుమ్మలు.. కట్‌ చేస్తే సీన్ రివర్స్..