Andhra Pradesh: అమలాపురం అల్లర్ల కేసు.. ఇప్పటి వరకు139 మంది అరెస్టు.. పూర్తి వివరాలివే

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన అమలాపురం(Amalapuram) అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 139 మందిని అరెస్టు చేశారు. వీరిలో జనసేన – 62, టీడీపీ – 21, బీజేపీ - 5, వైఎస్సార్‌సీపీ – 5, ఏపార్టీకి చెందని...

Andhra Pradesh: అమలాపురం అల్లర్ల కేసు..  ఇప్పటి వరకు139 మంది అరెస్టు.. పూర్తి వివరాలివే
Amalapuram Incident

Updated on: Jun 15, 2022 | 6:42 PM

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన అమలాపురం(Amalapuram) అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 139 మందిని అరెస్టు చేశారు. వీరిలో జనసేన – 62, టీడీపీ – 21, బీజేపీ – 5, వైఎస్సార్‌సీపీ – 5, ఏపార్టీకి చెందని వారు – 46 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్లర్లకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ(Konaseema) రణ క్షేత్రంగా మారింది. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ (BR.Ambedkar) జిల్లాగా మారుస్తూ మరోసారి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ గా మార్చవద్దని, కోనసీమ సాధన సమితి నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. వందల సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. కలెక్టరేట్‌ ముట్టడికి యువకులు, నిరసనకారులు ప్రయత్నించారు. అమలాపురం మొత్తాన్ని అష్టదిగ్భంధనం చేశారు.పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగిన ఆందోళనకారులు వారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 20 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. అంతే కాకుండా మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి నిప్పంటించారు.

మరోవైపు.. అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలను పోలీసులు నిలిపివేశారు. దీంతో సెల్‌ఫోన్‌లు, లాప్‌ట్యాప్‌లు పట్టుకొని విద్యార్థులు, ఉద్యోగులు నానా అవస్థలు పడ్డారు. నెట్‌వర్క్‌ కోసం జిల్లా సరిహద్దులు దాటి, ల్యాప్‌టాప్‌లతో వెళ్లి పని చేసుకున్నారు. బయటివారు అమలాపురంలోకి రాకుండా ఆంక్షలు విధించారు. అటు నెట్‌వర్క్‌ లేక ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..