AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం..

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒక విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా 10 ఏళ్ల బాలిక జ్వరంతో మరణించడం కలిచివేస్తోంది. అనారోగ్యాల బారిన పడి విద్యార్థులు మృతి చెందటంతో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.

విద్యార్థుల వరుస మరణాలు.. ఏజెన్సీలో మరోసారి కలకలం..
Students
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 3:23 PM

Share

పోలవరం జిల్లా చింతూరు ఏజన్సీలో వరుసగా విద్యార్థులు మృతి చెందటం కలచివేస్తోంది. ఆదివారం కోతులగుట్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి ఘటన మరువక ముందే.. తాజాగా మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎటపాక మండలం గొల్లగుప్ప గిరిజన గ్రామానికి చెందిన పద్దం రోజా అనే 10 ఏళ్ల బాలిక  జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ భద్రాచలం ఆసుపత్రిలో మృతి చెందింది. గొల్లగుప్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని జ్వరంతో మృతి చెందడం ఏజెన్సీని కలచివేస్తుంది. అనారోగ్యం బారినపడి అత్యంత తక్కువ రోజుల్లోనే చిన్నారులు మృతి చెందడంతో ఏజెన్సీలో వైద్య సేవలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిర్లక్ష్యంతో పాటు వైద్య శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.  బాలిక శుక్రవారం మృతి చెందగా.. ఇప్పటి వరకు డేట్ రిపోర్ట్ నమోదు చేయలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు చిన్నారుకు భద్రాచలం ఆసుపత్రిలో మలేరియాతో వైద్యం పొందుతున్నారు.

Follow Us