PM Modi: చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ.. ప్రస్టేజ్‌గా తీసుకున్న టీడీపీ, జనసేన.. 10లక్షల మందితో..

|

Mar 10, 2024 | 8:23 AM

ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఎవరికి ఎన్నిసీట్లు అన్నది మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, దేశంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ చాలా ఏళ్ల తర్వాత కలిశాయి. దీంతో రెండు పార్టీలకు మంచి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు సంబరపడుతున్నారు.

PM Modi: చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ.. ప్రస్టేజ్‌గా తీసుకున్న టీడీపీ, జనసేన.. 10లక్షల మందితో..
Ap Politics
Follow us on

ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఎవరికి ఎన్నిసీట్లు అన్నది మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, దేశంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ చాలా ఏళ్ల తర్వాత కలిశాయి. దీంతో రెండు పార్టీలకు మంచి బూస్టింగ్ వచ్చే అవకాశం ఉందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ క్రమంలోనే.. తమ పొత్తును ఏపీలో భారీగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ. ఇందుకు.. ఈ నెల 17న చిలకలూరిపేట సభను వేదికగా చేసుకోవాలని చూస్తున్నాయి. మొదట్నించి పొత్తులో ఉన్న టీడీపీ-జనసేన ఇప్పటికే తాడేపల్లిగూడెం, మంగళగిరిలో రెండు ఉమ్మడి సభలు జరిపాయి. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అవ్వడంతో.. చిలకలూరిపేట సభను ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి.

ఎన్డీఏలో టీడీపీ-జనసేన చేరడంతో.. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మోదీ కన్ఫామ్ చేస్తే.. ఒకరోజు అటూ ఇటుగా అయినా సభ.. పెద్దఎత్తున జరపాలని చూస్తున్నారు. మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేట సభకు 10లక్షల మందిని తీసుకురావాలని ప్లాన్ చేశారు. ఈసారి తమ సభకు బస్సుల సమస్య రాకుండా.. అచ్చెన్నాయుడు ముందే మేల్కొన్నారు. సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీకి లేఖ రాశారు.

ఎన్డీఏ కూటమిగా జరిపే మొదటి సభ.. చిలకలూరిపేట బహిరంగ సభ. నిన్నమొన్నటి వరకు ఎన్డీఏలో చేర్చుకుంటారా లేదా అన్న డైలమా ఉండేది. కానీ మూడు పార్టీలు కలవడం ఎన్డీఏకు బలం పెరగడంతో.. ఏపీలో అధికార వైసీపీకి.. తమ బలం, బలగం ఏంటో చూపించాలనుకుంటున్నాయి బీజేపీ, టీడీపీ. జనసేన, జన సమీకరణే కాకుండా.. గెలిస్తే తామేం చేస్తామో కూడా ఇదే సభ నుంచి ప్రజలకు క్లియర్‌గా చెప్పాలని చూస్తున్నారు మూడు పార్టీల నేతలు. మరి మూడు పార్టీల ఉమ్మడి మీటింగ్‌ ఎలా ఉంటుందో చూడాలంటే.. 17వరకు ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..