Visakhapatnam: ప్రధాని శంకుస్థాపన చేసి యూనిటీ మాల్.. విశేషాలేంటో తెలుసా..?
విశాఖలో మరో భారీ మాల్ నిర్మాణం కాబోతోంది. చేనేత హస్త కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంతో యూనిటీ మాల్ ఏర్పాటు కానుంది. 172 కోట్ల రూపాయల వ్యయంతో భీమిలి బీచ్ రోడ్‌లో నిర్మించే యూనిటీ మాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ భవనంలో.. షాపులు, కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్లు, మినీ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయి.

విశాఖలో మరో భారీ మాల్ నిర్మాణం కాబోతోంది. చేనేత హస్త కళాకారులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంతో యూనిటీ మాల్ ఏర్పాటు కానుంది. 172 కోట్ల రూపాయల వ్యయంతో భీమిలి బీచ్ రోడ్‌లో నిర్మించే యూనిటీ మాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. జీ ప్లస్ ఫోర్‌గా నిర్మించే ఈ భవనంలో.. షాపులు, కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్లు, మినీ థియేటర్లు కూడా ఉంటాయి.
విశాఖ – భీమిలి బీచ్‌రోడ్డులో తిమ్మాపురం వద్ద యూనిటీ మాల్ నిర్మాణం జరుగుతుంది. రామానాయుడు స్టూడియో ఉన్న ప్రాంతంలో కొండ దిగువన ఈ వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. రూ. 172 కోట్లతో ఈ మాల్ నిర్మాణానికి అమరావతి నుంచి ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Pm Ekta Mall In Vizag
హస్త కళలు, చేనేత కళాకారులకు ప్రోత్సాహం..
భీమిలి బీచ్ రోడ్ లో నిర్మాణం తలపెట్టిన యూనిటీ మాల్.. హస్తకళలు, చేనేత వృత్తులను ప్రోత్సహించేందుకు అందుబాటులోకి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మాల్స్ ఏర్పాటుచేస్తోంది. అందులో ఏపీకి కేటాయించిన మాల్ తిమ్మాపురంలో నిర్మిస్తున్నారు. యూనిటీ మాల్‌కు విశాఖ రూరల్ మండలం మధురవాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 462/2 లో అయిదు ఎకరాల భూమిని కేటాయించారు. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్థలంలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిటీ మాల్ నిర్మిస్తారు.
జీ+4 అంతస్తులో మాల్ నిర్మాణం జరుగుతుంది. నిర్మాణ బాధ్యత ను ఏపీఐఐసీకి అప్పగించారు. భవన నిర్మాణానికి 110 కోట్ల రూపాయలు కేటాయించారు. మాల్ నిర్మాణం పూర్తయిన తరువాత షాపుల ఇంటీరియర్ డెకరేషన్, ఇతర నిర్వహణ, వసతులకు మరో 62 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 86 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మాల్ నిర్మాణం పూర్తయిన తరువాత నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత చేనేత జౌళి శాఖకు అప్పగించనున్నారు.
యూనిటీ మాల్‌లో ఏయే అంతస్తులో..
యూనిటీ మాల్‌లో మొదటి రెండు అంతస్తుల్లో 62 షాపులు నిర్మించనున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులకు కేటాయిస్తారు. ఏపీకి చెందిన వారికి 26 షాపులు.. మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారికి 36 షాపులు కేటాయిస్తారు. మూడో అంతస్తు నుంచి బీచ్ ను చూసే విధంగా చక్కటి వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తారు. నాలుగో అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లు, రిటైల్ స్టోర్లు, రెస్టారెంట్లు, రిక్రియేషన్ జోన్, ఫిట్‌నెస్ సెంటర్, ఫర్నీచర్ స్టోర్లు ఉంటాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్.. దేశంలో తయారుచేసే చేతివృత్తులు ఈ యూనిటీ మాల్‌లో విక్రయిస్తారు.
ఏటికొప్పాక బొమ్మల నుంచి..
యూనిటీ మాల్‌లో.. ఉదాహరణకు ఏటికొప్పాక బొమ్మలకు ప్రోత్సహిస్తారు. అలాగే ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు, ఈశాన్య భారతంలో చేతివృత్తి ఉత్పత్తులు వంటివి ఇక్కడ అమ్మకాలు చేస్తారు. అలాగే దేశీయంగా భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రోత్సాహం, పర్యాటం అభివృద్ధి పీఎం ఏక్తామాల్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఈ నిర్మాణానికి కేపీసీకి బిడ్ దక్కింది. వచ్చే ఏడాది మార్చికల్లా పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
