Pigeon Racing: ఏపీ(Andhra Pradesh)లో కోళ్ళ పందాలు, పొట్టేళ్ల పందాలు వంటివే కాదు.. తాజాగా పావురాళ్ళ పందాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు పావురాల బెట్టింగ్‌తో హల్‌చల్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి దగ్గర పీజియన్ రేస్ జరిగింది. ఈ రేస్ కోసం చెన్నై నుంచి 4 లారీలలో ప్రత్యేక కేజ్ లలో పావురాల్ని తీసుకువచ్చారు. కాగా చిన్న కొత్తపల్లి వద్ద ఆ పావురాలని వదిలిపెట్టారు నిర్వాహకులు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేతగా నిలుస్తుంది.
పావురం యజమానికి బహుమతిని ఇవ్వనున్న విండో పీజియన్. కాగా విండో పీజియన్ సంస్థ ఆధ్వర్యంలో పీజియన్ రేస్‌కు ఏర్పాట్లు చేశారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు బెట్టింగ్ రాయుళ్ల అటకట్టించారు. బెట్టింగ్‌కు పాల్పడిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే గతంలోనూ పావురాల బెట్టింగ్ హల్ చల్ చేశాయి.
Also Read: