Visakhapatnam: గాజువాకలో కొందరి బరితెగింపు.. పందుల కోసం ఏకంగా డంపింగ్ యార్డ్ గేట్ పగలగొట్టి..

|

Jun 15, 2021 | 10:11 PM

Visakhapatnam: విశాఖపట్నంలోని గాజువాకలో పందుల పెంపకం దారుల బరితెగించి ప్రవర్తించారు. ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే దాడి చేసి..

Visakhapatnam: గాజువాకలో కొందరి బరితెగింపు.. పందుల కోసం ఏకంగా డంపింగ్ యార్డ్ గేట్ పగలగొట్టి..
Pigs
Follow us on

Visakhapatnam: విశాఖపట్నంలోని గాజువాకలో పందుల పెంపకం దారుల బరితెగించి ప్రవర్తించారు. ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే దాడి చేసి పందులను తరలించుకుపోయారు. ఈ షాకింగ్ ఘటనతో గాజువాకలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గాజువాకలో పందుల బెడద ఎక్కువైపోయింది. రోడ్లపై పందులు విచ్చల విడిగా తిరుగుతుండటంపై ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పందుల బెడదను సీరియస్‌గా తీసుకున్న గాజువాక మున్సిపల్ కమిషనర్.. రోడ్లపై పందులు కనిపిస్తే బందించి డంపింగ్ యార్డ్‌లో పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు జీవీఎంసీ సిబ్బంది.. రోడ్లపై విచ్చల విడిగా తిరుగుతున్న పందులను డంపింగ్ యార్డ్‌లోకి తరలించారు.

మున్సిపల్ సిబ్బంది పందులను బందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పందుల యజమానులు.. ఏకంగా డంపింగ్ యార్డ్‌లోకి చొరబడ్డారు. జీవీఎంసీ సిబ్బంది స్వాధీనంలో ఉన్న పందులను డంపింగ్ యార్డ్ గేట్ పగలగొట్టి బలవంతంగా తరలించుకుపోయారు. కమిషనర్ ఆదేశాల మేరకు రోడ్లపై తిరుగుతున్న పందులను పట్టుకుని డంపింగ్ యార్డ్‌కి తరలించామని సిబ్బంది చెబుతున్నారు. అయితే, పందుల యజమానుల తీరుతో షాక్ అయిన మున్సిపల్ సిబ్బంది పై అధికారులకు ఫిర్యాదు చేశారు. డంపింగ్ యార్డ్ సిబ్బంది పందుల పెంపకం దారుల దౌర్జన్యంపై గాజువాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్ కోసం ముందుగా రిజిస్టర్‌ అవసరంలేదన్న కేంద్రం.. ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా టీకాల పంపిణీ