Pulasa Fish: ఔర.. ఔర.. పులసతో పసందైన విందు.. గోదారోళ్ల ఆతిధ్యం అంటే ఇది కదా..

| Edited By: Shaik Madar Saheb

Jul 29, 2024 | 5:36 PM

పుస్తలైన అమ్మి ఒక్కసారి అయినా పులస చేప తినాలి అంటారు.. అంటే.. దాని ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతటి ఖరీదైన పులస చేప కోనసీమ, గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది.. ఒక చిన్న చేప కొనాలంటేనే వేల రూపాయలు వేచ్చించాలి.. అలాంటి పులస చేపతో ఏకంగా విందు భోజనమే పెడితే ఎలా ఉంటది..

Pulasa Fish: ఔర.. ఔర.. పులసతో పసందైన విందు.. గోదారోళ్ల ఆతిధ్యం అంటే ఇది కదా..
Pulasa Fish
Follow us on

పుస్తలైన అమ్మి ఒక్కసారి అయినా పులస చేప తినాలి అంటారు.. అంటే.. దాని ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతటి ఖరీదైన పులస చేప కోనసీమ, గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతుంది.. ఒక చిన్న చేప కొనాలంటేనే వేల రూపాయలు వేచ్చించాలి.. అలాంటి పులస చేపతో ఏకంగా విందు భోజనమే పెడితే ఎలా ఉంటది.. అచ్చం అదే చేశారు పి.గన్నవరం మండలం ఫోటో, వీడియోగ్రాఫర్ లు.. ఏకంగా వందలాది మందికి పులసతో భోజనంపెట్టి ఔరా అనిపించారు.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఫోటో, వీడియో గ్రాఫర్ లు పులస తో విందు ఇచ్చారు.. పి.గన్నవరం మండలం ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా పులసతో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, ఇతర జిల్లాల నుండి వచ్చిన ఫోటో వీడియో గ్రాఫర్లకు అందరికీ చికెన్, మటన్ తో పాటు పులసతో విందు ఏర్పాటు చేసి… అతిధి మర్యాదలు చేశారు.

వీడియో చూడండి..

కోనసీమలోనే అదికూడా వరదల సమయంలో దొరికే అరుదైన అత్యంత ఖరీదైన పులస చేప భోజనం పెట్టడంతో కార్యక్రమానికి వచ్చిన వారు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరదలు ఎక్కువగా ఉండటంతో పులస అరకోరగా మాత్రమే దొరుకుతున్న ఈ సమయంలో విందు భోజనం ఏర్పాటు చేసి.. అధిదులకు ఆతిథ్యం ఇవ్వడంలో తమకు సాటెవ్వరూ లేరంటూ మరోసారి కోనసీమ వాసులు నిరూపించారని అక్కడికి వచ్చిన వారు విందును ఆరగించేశారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..