Chandrababu Naidu Birthday: టీడీపీ(TDP) అధినేత మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. తన 73వ పుట్టిన రోజు వేడుకలను చంద్రబాబు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన 72 ఏళ్ళు పూర్తి చేసుకుని 72వ ఏడులోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు గారికి భగవంతుడు ఆశీస్సులు అందించి, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి నాయుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాజాగా రెండేళ్లకు ముందే.. ఎన్నికలకు రెడీ అవుతూ.. ప్రజల ముందుకు సరికొత్త ప్రణాళికతో వెళ్తున్నారు.