Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: సాయంత్రం అమలాపురంలో పవన్ భారీ బహిరంగ సభ.. వెండి పూల విజయమాలను ఇవ్వనున్న అభిమాని

పవన్ పై తమకున్న అభిమానాన్ని కోనసీమ వాసులు ప్రత్యేకంగా చాటుకుంటూ పవన్ కళ్యాణ్ ఫొటోతో ఉన్న ప్లెక్సీతో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. అంతేకాదు జనసేన అధినేతకు అమలాపురం పర్యటన తీపి జ్ఞాపకంగా మరేవిధంగా కోనసీమ వాసులు వారాహి యాత్ర‌కు నీరాజ‌నం పడుతున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు మోటారు సైకిళ్ల ర్యాలీతో పవన కు ఘన స్వాగతం పలికారు. 

Pawan Kalyan: సాయంత్రం అమలాపురంలో పవన్ భారీ బహిరంగ సభ.. వెండి పూల విజయమాలను ఇవ్వనున్న అభిమాని
Pawan Amp Tour
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2023 | 9:56 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అభిమానులు, కార్యకర్తలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అమలాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సాయంత్రం స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ జనసేన పార్టీని నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పిలుపునిచ్చారు.

కోనసీమ యాత్రలో బిజిబిజిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ పై తమకున్న అభిమానాన్ని కోనసీమ వాసులు ప్రత్యేకంగా చాటుకుంటూ పవన్ కళ్యాణ్ ఫొటోతో ఉన్న ప్లెక్సీతో స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. అంతేకాదు జనసేన అధినేతకు అమలాపురం పర్యటన తీపి జ్ఞాపకంగా మరేవిధంగా కోనసీమ వాసులు వారాహి యాత్ర‌కు నీరాజ‌నం పడుతున్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు మోటారు సైకిళ్ల ర్యాలీతో పవన కు ఘన స్వాగతం పలికారు.

మరోవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఒక అభిమాని 511 వెండి పూలతో ఒక దండ తయారు చేయించాడు. మండంలోని సమనస గ్రామ సర్పంచ్ మామిడిపల్లి దొరబాబు తనకు జనసేన అధినేతపై ఉన్న అభిమానాన్ని చాటుతూ ఈ వెండి పువ్వుల దండను తయారు చేసేవాడు. ఇప్పటికే ఈ దండను తమ గ్రామ దేవత పోలేరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను చేయించాడు. పవన్ కళ్యాణ్ కోరికలు తీరాలని మొక్కుకున్నట్లు చెప్పారు. తన ఎంతో ఇష్టంగా తయారు చేయించిన ఈ వెండి పువ్వుల దండను ఈ రోజు అమలాపురంలో జరగనున్న బహిరంగ సభలో జనసేనాని మెడలో వేయనున్నాని చెప్పాడు దొరబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..